Harshavardhan Reddy: జూపల్లి కృష్ణారావు పై కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జూపల్లి కృష్ణారావు పచ్చి రాజకీయ అవకాశవాది అని హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. కొల్లాపూర్ నియోజక వర్గంలో అక్రమ కేసులు పెట్టలేదని స్పష్టం చేశారు. జూపల్లి చెబుతున్న కేసులపై ఎటువంటి విచారణకైనా నేను సిద్ధమని అన్నారు. జూపల్లి కృష్ణారావు వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ మంత్రిగా అవకాశం ఇచ్చింది. కొల్లాపూర్ నియోజక వర్గానికి కృష్ణారావు చేసింది ఏమీ లేదన్నారు. అక్రమ కేసులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు…. కొల్లాపూర్ లో ఏం జరుగుతుందో, జూపల్లి కృష్ణారావు నిజస్వరూపం ఏంటో కొల్లాపూర్ ప్రజలకు తెలుసన్నారు. కొల్లాపూర్ ప్రజలు 2018లో జూపల్లినీ ఓడించిన బుద్ధి రాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా.. కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అరాచకాలపై మొరపెట్టుకుంటున్నా పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లే ముందు జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను బిఆర్ఎస్ ఉన్నాను లేనో పార్టీ అధినాయకత్వానికి తెలియాలి గత మూడేళ్లుగా పార్టీ సభ్యత్వ బుక్‌లెట్లు కూడా ఇవ్వలేదని జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అరాచకాలపై మొరపెట్టుకుంటున్నా పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని జూపల్లి కృష్ణారావు ఆరోపించారు.
ఎస్సీ ,ఎస్టీ, బీసీ కమిషన్లను ఆశ్రయించాలని నాకు సలహా ఇచ్చారని అన్నారు. సాధించిన తెలంగాణలో అనుకున్న లక్ష్యాలు సాధించామా లేదా? అన్నది చూడల్సిన సమయం అన్నారు. సమైఖ్య రాష్ట్రంలో కూడా జరగని దాడులు ఇప్పుడు జరుగుతున్నాయని అన్నారు. ప్రగతి భవన్ ఆడమన్నట్టు ఆడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను పోటీ చేస్తే పోలింగ్ ఏజెంట్ లు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పార్టీ అధిష్టానం తనకు బి ఫారాలు కూడా ఇవ్వలేదన్నారు. అయితే తన మద్దతుదారులు స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దిశలో రాష్ట్రం నడుస్తుందో లేదో చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
Top Headlines @1PM: టాప్ న్యూస్