Site icon NTV Telugu

తెలంగాణలో బీజేపీ విష సర్పం లెక్క పెరుగుతుంది : తమ్మినేని వీరభద్రం

టీఆర్ఎస్, బీజేపీ లపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినని వీరభద్రం తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు సేవ.. పనులు చేస్తే ఓట్లు.. సీట్లు వచ్చేవని, ఓట్లు సీట్లు తెచ్చుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కరోనా టైం లో ఒక్క ఐసోలేషన్ కేంద్రం అయినా పెట్టరా..? అని ప్రశ్నించారు. మేము పేదల కోసం ఐశోలేషన్ కేంద్రాన్ని పెట్టాం..గర్వంగా చెప్తాం అని ఆయన అన్నారు. మేము ఓట్లు.. సీట్లు గెలుచుకోవడంలో వెనక పడ్డాం నిజమే.. ఓట్లు వచ్చినా.. సీట్లు రాకపోయినా ప్రజల పక్షాన సీపీఎం ఉంటుందని ఆయన తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీ మీద మిలిటెంట్ పోరాటాల నిర్మాణం కోసమే ఈ మహాసభ అని ఆయన అన్నారు.

తెలంగాణలో బీజేపీ విష సర్పం లెక్క పెరుగుతుందని, అధికారం ఇప్పట్లో రాకపోవచ్చు, కానీ బీజేపీ వైఖరి ఏంటన్నది అందరూ ఆలోచన చేయాలన్నారు. విభజన హామీలు అమలు చేయని కేంద్రం మీద కేసీఆర్ ఎందుకు కొట్లాడటం లేదని, మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాదిరిగా తెగబడి ఎందుకు కొట్లదటం లేదు. ఈ మద్య బీజేపీ కి వ్యతిరేకంగా మాట్లాడే ఆలోచన ఎదో చేస్తున్నారు . ప్రజలు నమ్మేలా కేసీఆర్ వ్యవహారం చేస్తే హర్షిస్తం అని ఆయన అన్నారు.

Exit mobile version