Suven Pharma: మరోసారి వార్తల్లో నిలిచిన సువెన్ ఫార్మా. ఎందుకు? ఏమిటి? ఎలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suven Pharma: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సువెన్ ఫార్మాస్యుటికల్స్‌లో మెజారిటీ వాటా కొనుగోలు పట్ల రెండు ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. బ్లాక్‌స్టోన్ మరియు అడ్వెంట్ ఇంటర్నేషనల్ అనే కంపెనీలు సువెన్ ఫార్మాలో షేర్ కోసం విడివిడిగా సంప్రదింపులు జరుపుతున్నాయని స్టాక్ మార్కెట్ వర్గాల సమాచారం. సువెన్ ఫార్మాలో షేరును విక్రయించే విషయం ప్రమోటర్ల పరిశీలనలో ఉందనే వార్తలు ఇంతకు ముందు కూడా వచ్చాయి. కానీ.. ఆ వార్తలపై సువెన్ ఫార్మా స్పందించలేదు.
సువెన్ ఫార్మాలో ప్రమోటర్లు 60 శాతం షేరు కలిగి ఉన్న సంగతి తెలిసిందే. వాటాను దక్కించుకునేందుకు ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు పోటీ పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై సువెన్ ఫార్మా స్పందిస్తూ షేర్ హోల్డర్లకు, పార్ట్నర్లకు అదనపు విలువ, ప్రయోజనం కలిగించే అన్ని వ్యూహాత్మక మార్గాలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటామని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు తెలిపింది. ప్రమోటర్ల షేర్ (60 శాతం) మార్కెట్ వ్యాల్యూ సుమారు రూ.6,400 కోట్లు అని అంటున్నారు. ఇందులో సగానికి సగం (50 శాతం) వాటాను అమ్మినా ఆ లావాదేవీ విలువ కనీసం రూ.3 వేల కోట్లకు పైగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
బ్లాక్‌స్టోన్, అడ్వెంట్ ఇంటర్నేషనల్.. ఈ రెండూ అగ్రరాజ్యం అమెరికాకు చెందినవే. సువెన్ ఫార్మా మేనేజ్‌మెంట్‌తో ఈ సంస్థలు జరుపుతున్న చర్చలు చివరి దశకు చేరుకున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అడ్వెంట్ కంపెనీ ఇండియాలో ఫార్మా సెక్టార్‌లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. గడచిన రెండేళ్లలో ఆర్‌ఏ కెమ్ ల్యాబ్స్, అవ్రా ల్యాబ్స్(రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్)ను సొంతం చేసుకుంది. ఇంకా కొన్ని సంస్థలను కొనుగోలు చేయాలని ఉత్సాహపడుతోంది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!