Summer: రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్జన్ సలహాలు, సూచనలు జారీ చేశారు.
ఎండలో పని చేయవద్దని, ఆటలు ఆడవద్దని, బూట్లు లేకుండా బయటికి వెళ్లవద్దని చెప్పారు. పార్కింగ్ చేసిన వాహనాల్లోకి పిల్లలు, పెంపుడు జంతువులు వెళ్లవద్దని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వంటగదికి దూరంగా ఉండాలని సూచించారు. మద్యం, టీ, కాఫీ, స్వీట్లు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలని చెప్పారు. శరీర ఉష్ణోగ్రత 40.5 సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటే, విపరీతమైన చెమట, దాహం, మగత, బలహీనత, కళ్లుతిరగడం, కండరాల నొప్పులు ఉంటే, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read also: Hyderabad Crime: సికింద్రాబాద్ లో దారుణం.. పక్కకు జరగమంటే ప్రాణాలే తీశారు..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయం 11 గంటల తర్వాత రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. వడగాలులు, వేడితీవ్రతకు జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇంకా రెండు మూడు రోజుల్లో ఎండలు మండిపోవచ్చని అంటున్నారు వాతావరణ నిపుణులు.
వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే ఇంకా రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మార్చి చివరి నాటికే ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. ఇది సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికం. కొన్ని చోట్ల ఏకంగా 43 డిగ్రీలు నమోదవుతోంది. రాత్రి పొద్దుపోయాకా కూడా చల్లబడడం లేదు. ఫలితంగా ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారం రోజులుగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి.
CM Kejriwal : సీఎం కేజ్రీవాల్ బ్యారక్ పక్కన ఎవరెవరు గ్యాంగ్ స్టర్లు ఉన్నారంటే ?