Shalini Kidnap Case: శాలిని కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్.. యువతికి ఆల్రెడీ పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Sircilla Shalini Kidnap Case Takes Unexpected Turn: రాజన్న సిరిసిల్లా జిల్లాలో సంచలనం సృష్టించిన శాలిని కిడ్నాప్ కేసులో తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. కిడ్నాప్ చేసిన జాన్‌కి, శాలినికి ఇదివరకే పెళ్లి అయ్యింది. అయితే.. శాలిని మైనర్ కావడం, ఈ పెళ్లి కూడా ఇష్టం లేకపోవడంతో యువతి తల్లిదండ్రులకు కేసు పెట్టారు. ఈ కేసులో జాన్ పది నెలల జైలు శిక్షను కూడా అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత జాన్ మళ్లీ శాలినికి దగ్గర అవుతుండడంతో.. తల్లిదండ్రులకు ఆమెకు మరో యువకుడితో నిన్న (సోమవారం) నిశ్చితార్థం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న జాన్.. పక్కా ప్లాన్ ప్రకారం ఈ కిడ్నాప్ వ్యవహారానికి తెరలేపాడు. తెల్లవారుజామున ఆలయంలో పూజ ముగించుకొని శాలిని బయటకు రాగానే.. ఆమె తండ్రి ముందే తన స్నేహితుల సహకారంతో బలవంతంగా కారులో ఎక్కించుకొని, అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. శాలిని ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Kerala Couple With Jersey: ఫిఫా వరల్డ్‌కప్ ఫీవర్.. జెర్సీలతో పెళ్లి పీటలెక్కిన వధూవరులు
Also Read
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
అసలు ఈ కిడ్నాప్ ఎలా జరిగిందంటే.. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు శాలిని తన తండ్రితో కలిసి హనుమాన్ ఆలయానికి వెళ్లింది. పూజ ముగించుకొని బయటకు వచ్చింది. అప్పటికే అక్కడ తన స్నేహితులతో మాటువేసిన జాన్.. శాలిని బయటకు రావడం గమనించి, వెంటనే కార్ వేసుకొని ఆలయం ముందుకు వచ్చాడు. బలవంతంగా ఆమెని కారులో ఎక్కించుకున్నాడు. తండ్రి ప్రతిఘటించడానికి ప్రయత్నించాడు కానీ, జాన్ స్నేహితులు ఆయన్ను అడ్డుకున్నారు. అటు శాలిని పారిపోవడానికి ప్రయత్నించగా, మరో యువకుడు ఆమెని పట్టుకొని కారులో ఎక్కించాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ కిడ్నాప్ వ్యవహారం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. జాన్‌కి ఎవరెవరు సహకరించారు? ఆ కారు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యుంది? వీళ్లంతా ఎక్కడికి వెళ్లి ఉంటారు? అనే కోణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Corona Fear: ఏపీలో విచిత్ర ఘటన.. నాలుగేళ్లుగా తల్లి, కూతురు ఇంటికే పరిమితం
తాజావార్తలు
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!