హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల్ని నివారించేందుకు.. రీసెంట్‌గా ప్రభుత్వం స్పీడ్ లిమిట్ విషయమై కొత్త నియమాల్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే! ప్రధాన రహదారులపై కారు 60 కి.మీ. వేగంతోనూ, ఆటోలు & బైక్‌లు 50 కి. మీ. వేగంతోనే ప్రయాణించాలని నిర్దేశించింది. కాలనీ రోడ్లలో గరిష్టంగా 30 కి. మీ. వేగంతోనే వెళ్ళాలని.. అంతకుమించి వేగంగా వెళ్తే ఫైన్స్ వేయడం జరుగుతుందని హెచ్చరించారు. బుధవారమే ఈ స్పీడ్ లిమిట్‌పై అధికార ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే.. హైదరాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్లపై స్పీడ్ లిమిట్‌ను 80 కి.మీ. పెంచుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఆస్పత్రులు, స్కూల్ జోన్‌లలో మాత్రం 40 కి.మీ. కంటే ఎక్కువ వేగంగా వెళ్ళకూడదని పరిమితి విధించారు. మిగతా అన్ని రోడ్లలో 60 కి.మీ. స్పీడ్ లిమిట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.