BJP Exhibition: ఆసక్తి రేపుతున్న ఫోటో.. కృష్ణుడు ఆయనే.. అర్జునుడు ఆయనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ రథంపై స్వారీ చేస్తున్నట్లుగా కళాకారులు రూపొందించిన పేయింటింగ్ అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. ఈ పెయింటింగ్ లో కృష్ణుడూ, అర్జునుడూ.. రెండూా అంటూ వేసిన మోడీ ఫోటో ఆసక్తి కరంగా మారింది. పెయింటింగ్ అంతా కాషాయి రంగుతో.. రథం ఏర్పాటు చేసి ఆ రథంలో మోడీ ని కూర్చొని సవారి చేస్తున్నట్లుగా కళాకారులు చిత్రించారు. జూలై 1న నగరానికి వచ్చిన నడ్డా.. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అందులో మోడీ పెయింటింగ్ అందరికి ఆశక్తి కరంగా మారింది. ఈ పెయింటింగ్ లో కృష్ణుడూ, అర్జునుడూ రెండూ ఆయనేవ్యహరిస్తున్నారని కళాకారులు వేసిన ఈ పెయింటింగ్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ పెయింటింగ్ చిత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది.
దీనికి సంబంధించిన వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు జెపి నడ్డా. మోడీ పెయింటింగ్ అర్థాన్ని ఎగ్జిబిషన్ ఇన్చార్జి రాకేష్ రెడ్డి వివరిస్తూ.. మహాభారతంలో కృష్ణుడు రథాన్ని స్వారీ చేస్తూ అర్జునుడి సందేహాలను నివృత్తి చేస్తూ ఉంటారని.. ఆత్మ విశ్వాసాన్ని నింపుతూ అధర్మంపై ధర్మం గెలిచేలా చేయడం దాని సారాంశమని గుర్తుచేశారు. దీనికి సారూప్యంగా కలియుగంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా తానే కృష్ణుడు.. అర్జునుడి అవతారాలను పోషిస్తూ భారత ప్రగతి చక్రాన్ని అభివృద్ధి.. సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెళ్తున్నారని అర్థం. ఇదే పెయింటింగ్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. పెయింటింగ్లో రథం వెనకవైపున మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కీలకమైన విధాన నిర్ణయాలు లోగోల రూపంలో ఉన్నాయని వివరించారు. దేశాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మల్చడంలో ఆయ చేస్తున్న కృషి ఈ పెయింటింగ్లో కనిపిస్తుందన్నారు. ఈనేపథ్యంలో.. మేక్ ఇన్ ఇండియా, జన్ ధన్ యోజన, ఉజ్వల్ యోజన, డిజిటల్ ఇండియా, ఖేలో ఇండియా, జీఎస్టీ, స్వచ్ఛ భారత్, ఆర్టికల్ 370 రద్దు, రామమందిరం, హర్ ఘర్ నల్ పానీ… ఇలాంటి అనేక పథకాలను పెయింటింగ్లో చిత్రీకరించారు.
Also Read
IND Vs ENG: బుమ్రా దెబ్బ.. ఇంగ్లండ్ అబ్బ.. రెండోరోజు కూడా మనదే
తాజావార్తలు
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!