మూడు రోజుల సమ్మె జీతాన్ని ప్రతి కార్మికుడికి చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ అన్నారు. సోమవారం గోదావరిఖనిలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణిలో జరిగిన సమ్మె రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సమ్మెగా ఆయన అభివర్ణించారు. సింగరేణిలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి సమ్మెలో బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. కానీ ఈ మూడు రోజుల సమ్మెలో బొగ్గు ఉత్పత్తి జరగలేదంటే యాజమాన్యం, రాష్ర్ట ప్రభుత్వ తీరును అర్థం చేసుకోవచ్చన్నారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు బొగ్గు బ్లాకుల నిర్వహణకు ముందుకు వస్తే కేంద్రం సింగరేణికి అప్పగిస్తుందన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల తరువాత కేసీఆర్‌కు మతి భ్రమించిందని సోమారపు అన్నారు. సీఎం కేసీఆర్ తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని సత్యనారాయణ అన్నారు.
