సోమారపు సత్యనారాయణ. రామగుండం మాజీ ఎమ్మెల్యే. కండువా మార్చినా ఆయనకు పట్టు చిక్కడం లేదట. ఇన్నాళ్లూ ఏ పార్టీలో ఉన్నా.. నిత్య పోరాటమే చేస్తున్నారు. ఎక్కడ ఉన్నా.. కొత్తగా వచ్చిన నేతలతో ఆయనకు తలనొప్పులు తప్పడం లేదట. దీంతో సొంత గూటిని వదిలి తప్పు చేశామా అని ఆలోచన చేస్తున్నట్టు టాక్. ప్రస్తుతం అక్కడా ఖాళీ లేకపోవడంతో మరోసారి స్వతంత్రంగా పోటీ చేసి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే యోచనలో ఉన్నారట సోమారపు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ…
మూడు రోజుల సమ్మె జీతాన్ని ప్రతి కార్మికుడికి చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ అన్నారు. సోమవారం గోదావరిఖనిలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణిలో జరిగిన సమ్మె రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సమ్మెగా ఆయన అభివర్ణించారు. సింగరేణిలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి సమ్మెలో బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. కానీ ఈ మూడు రోజుల సమ్మెలో బొగ్గు ఉత్పత్తి జరగలేదంటే యాజమాన్యం, రాష్ర్ట ప్రభుత్వ తీరును…