Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Somajiguda Apartment Fire Accident Hyderabad

Fire Accident : హైదరాబాద్‌ సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం

Published Date :December 28, 2025 , 8:34 pm
By Gogikar Sai Krishna
  • హైదరాబాద్‌ సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం
  • ఆల్ పైన్ హైట్స్ అపార్ట్‌మెంట్‌ 5వ అంతస్తులో చెలరేగిన మంటలు
  • బయటకు పరుగులు పెట్టిన అపార్ట్‌మెంట్‌ వాసులు
  • మంటలను అదుపు చేసిన ఫైర్‌ సిబ్బంది.
Fire Accident : హైదరాబాద్‌ సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Fire Accident : నగరంలోని అత్యంత రద్దీగా ఉండే సోమాజిగూడ ప్రాంతంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ఆల్ పైన్ హైట్స్ (Alpine Heights) అపార్ట్‌మెంట్ భవనంలోని ఐదో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. ఆదివారం కావడంతో అపార్ట్‌మెంట్‌లోని నివాసితులంతా ఇళ్లలోనే ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో ఐదో అంతస్తులో ఉన్న వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. పొగ దట్టంగా వ్యాపించడంతో అపార్ట్‌మెంట్‌లోని ఇతర అంతస్తుల నివాసితులు కూడా వెంటనే భవనం వెలుపలికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. అదృష్టవశాత్తూ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో అవి ఇతర ఇళ్లకు వ్యాపించకుండా ఆగిపోయాయి.

ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆ ప్లాట్‌లోని ఫర్నిచర్ , ఇతర వస్తువులు కాలిపోయి భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అపార్ట్‌మెంట్లలో సరైన అగ్నిమాపక భద్రతా చర్యలు ఉన్నాయా లేదా అనే కోణంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.

Sheraj Mehdi: అమ్మాయిలు ఎలా ఉండాలో చెప్పడానికి ‘ఓ అందాల రాక్షసి’: షెరాజ్ మెహదీ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • "Hyderabad fire
  • apartment fire
  • fire accident
  • fire safety
  • Somajiguda

తాజావార్తలు

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

  • Off The Record: పార్టీ తనను సరిగా వాడుకోవడం లేదని ముద్రగడ ఫీలింగ్..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions