Software Deepthi: సాఫ్ట్‌వేర్ దీప్తి కేసు.. అదుపులో చెల్లి చందన, ఆమె ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Software Deepthi: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జగిత్యాల జిల్లా కోరుట్ల దీప్తి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నాలుగు రోజులుగా హైదరాబాద్ సహా ఏపీలోని పలు ప్రాంతాల్లో విసృత్త తనిఖీలు చేశారు పోలీసులు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దీప్తి సోదరి చందనతో పాటు మరో యువకుడి ఆచూకిని కనుగొన్నారు. ఒంగోలు సమీపంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఐదు రోజులుగా నాలుగు పోలీస్ బృందాలతో దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు చందన ఏం చెప్పనుంది. అక్క దీప్తిని తనే హత్య చేసిందా? లేక దీప్తిని చెల్లెలు చందన, ఆమె ప్రియుడు హత్య చేశారా? ప్రియుడి ప్రేమకోసం ఇదంతా చేసిందా? లేదా డబ్బులు, నగల కోసం చేసిందా? చెందన, ప్రియుడు ప్లాన్ ప్రకారమే దీప్తిని మద్యం తాగింది హత్య చేసి నగదుతో పరారయ్యరా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఏం జరిగిందంటే..
Also Read
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
- Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
- Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
భీమునిదుబ్బ ప్రాంతంలో దంపతులు బంకా శ్రీనివాస్‌రెడ్డి, మాధవి నివాసం ఉంటున్నారు. వీరికి దీప్తి (24), చందన, సాయి అనే ముగ్గురు పిల్లలు. దీప్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. రెండో కూతురు చందన బీటెక్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె ఇంట్లో ఖాళీగా ఉంది. కొడుకు సాయి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. బంధువులు రావడంతో శ్రీనివాస్‌రెడ్డి దంపతులు ఆదివారం హైదరాబాద్‌కు బయలుదేరారు. సోమవారం రాత్రి 10 గంటలకు తల్లిదండ్రులిద్దరూ తమ కుమార్తెలతో ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం మళ్లీ ఫోన్ చేయగా పెద్దమ్మాయి దీప్తి ఫోన్ రిసీవ్ చేయలేదు. చిన్న కూతురు చందన ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్‌లో ఉంది. వెంటనే ఇంటి పక్కనే ఉన్న వారికి సమాచారం అందించారు. వారు ఇంటి తలుపులు తెరిచి చూడగా దీప్తి అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు.
అనంతరం స్థానిక సమాచారంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సోఫాలో దీప్తి మృతదేహం పడి ఉండగా వంటగదిలో రెండు మద్యం సీసాలు, శీతల పానీయం సీసా, ఫుడ్ ప్యాకెట్లు కనిపించాయి. చెల్లి చందన కనిపించకుండా పోవడంతో ఆమె ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సోమవారం ఉదయం 5.12 గంటల నుంచి 5.16 గంటల వరకు ఓ యువకుడితో కలిసి నిజామాబాద్ బస్టాండ్‌లో కూర్చుంది. ఆ తర్వాత నిజామాబాద్ వెళ్తున్న బస్సు ఎక్కినట్లు కెమెరాల్లో రికార్డయింది. తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు దీప్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
Astrology: సెప్టెంబర్ 2, శనివారం దినఫలాలు
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!