కరీంనగర్ లో సోషల్ మీడియా దుర్వినియోగం అవుతుంది అని కరీంనగర్ శాంతి భద్రతల అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. తాజాగా మాట్లాడిన ఆయన కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఉంచగా అందులో భాగంగా గన్ తో దిగిన ఫోటో కనుగొన్నారు పోలీసులు. టాస్క్ ఫోర్స్ ప్రత్యేక నిఘాలో ఫోటో దిగిన వ్యక్తిని గుర్తించారు. అతను కరీంనగర్ గోదాం గడ్డకు చెందిన గడ్డం కృష్ణగా గుర్తించిన పోలీసులు తర్వాత ఆ ఫోటోలో ఉన్నది గన్ కాదు సిగరెట్ వెలిగించే లైటర్ గా తేల్చారు.
అయితే ప్రస్తుతం గడ్డం కృష్ణకు కరోనా పాజిటివ్ ఉందని ఐసోలేషన్ తర్వాత కేసు నమోదు చేస్తాం అని తెలిపారు. సోషల్ మీడియా లో రెచ్చగొట్టే ప్రేరేపించే పోస్టులు , అసభ్యకర పోస్టూలు పెడితే 107 CRPC కిందా కేసు నమోదు చేస్తాం… బైండోవర్ చేస్తాం. అలాగే ప్రవర్తనలో మార్పు లేకపోతే హిస్టరీ షీట్ తెరుస్తాం అని హెచ్చరించారు. మరియు యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.