Singur Dam: నిండుకుండలా సింగూరు..జలకళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీవర్షాలు వారం నుంచి తెలంగాణ వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు నిండు కుండలామారి జలకళను సంతరించుకుంది.నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక,మహారాష్ట్రాల నుండి భారీగా వరద నీరు సింగూర్ ప్రాజెక్టులోకి వచ్చిచేరుతుంది.దీనికి తోడు సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.గత వారం రోజులుగా రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 3 టీఎంసీలకు పైగా వరద నీరు వచ్చి చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింగూర్ ప్రాజెక్టు లోకి వరద నీటి ప్రవాహం రోజు రోజుకు భారీగా వచ్చి చేరుతోంది.
Donations: రాజకీయ పార్టీలనూ తాకిన కొవిడ్ దెబ్బ.. 41.49శాతం తగ్గిన విరాళాలు
Also Read
ప్రస్తుతం ప్రాజెక్టులోకి 15 వేల 955 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు లో 22.417 టీఎంసీల నీటి నిల్వగా నమోదైంది.సింగూర్ ప్రాజెక్టులోకి మరో నాలుగు,ఐదు టీఎంసీల వరద నీరు వచ్చిచేరితే ప్రాజెక్టు గేట్స్ ఎత్తి దిగువన ఉన్న ఘనపూర్,నిజాంసాగర్ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తామన్నారు ఇరిగేషన్ అధికారులు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి నీటి ఇన్ ఫ్లో కొనసాగుతుందన్నారు అధికారులు.
వర్షాలు ఇలాగే కురిస్తే వరద నీరు ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఎగువన ఉన్న మునిపల్లి, ఝరాసంగం, రాయికోడ్, న్యాల్ కల్, మనూరు, నాగల్ గిద్ద, రేగోడు, వట్ పల్లి మండలాలతో పాటు పుల్కల్ లో భారీ వర్షం నమోదు కావడంతో ఆ వరద నీరంతా ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో కలుస్తుంది. వరద నీటి ప్రవాహం రాకముందు ప్రాజెక్టులో 18 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా, తాజాగా కురిసిన వర్షాలకు దాదాపుగా మూడు టీఎంసీలకు పైగా కొత్త నీరు వచ్చి చేరింది. వానాకాలం ప్రారంభంలోనే ప్రాజెక్టులో సగం టీఎంసీల నీరు ఉండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కొత్తగా వచ్చి చేరిన వరద నీటితో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిసరాలు నీటి అలలతో కనువిందు చేస్తున్నాయి. పర్యాటకులు కూడా ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ప్రాజెక్టు దిగువ ఉన్న వ్యవసాయ సాగుకు,అలాగే తాగునీటి అవసరాలకు ఎలాంటి నీటి ఢోకా లేదన్నారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంజీరా నదిలోకి నీరుచేరుతుందన్నారు.దింతో మంజీరా పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు,రైతులు,పశువుల కాపారులు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు సూచించారు.
Lal Singh Chadda: చిరు, నాగ్, రాజమౌళి, సుకుమార్ కు ‘లాల్ సింగ్ చద్దా’ ప్రివ్యూ
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!