NTV Telugu Site icon

Tension in Siddipet: సిద్దిపేటలో టెన్షన్ టెన్షన్..

Siddipet Police

Siddipet Police

సిద్దిపేట జిల్లా కేంద్రంలో టెన్సన్ వాతావరణం నెలకొంది. ఇవాళ పోటా పోటీగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రెండు పార్టీల మధ్య రుణమాఫీ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు (మంగళవారం) సిద్దిపేటలోని మైనంపల్లి అంబేద్కర్ చౌక్‌లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

Read also: Lateral Entry Row: ప్రతిపక్షాల ఒత్తిడి తర్వాత లాటరల్ ఎంట్రీపై కేంద్రం యూ-టర్న్..

పొన్నాల నుంచి పాత బస్టాండ్ కు కాంగ్రెస్ నేతలు ర్యాలీగా బయలుదేరారు. బ్లాక్ ఆఫీస్ చౌరస్తా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు నుంచి పాత బస్టాండ్ వెళ్ళేలా కాంగ్రెస్ ప్లాన్ వేసుకున్నారు. అయితే.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉండటంతో రూట్ మార్చుకోవాలని పోలీసుల సలహా ఇచ్చారు. ముందు ఫిక్స్ చేసుకున్న రూట్ లోనే వెళ్తామని కాంగ్రెస్ నాయకుల పట్టుబట్టారు. బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో భారీగా పోలీసుల మోహరించారు. క్యాంప్ ఆఫీస్ వైపు కాంగ్రెస్ నాయకులు వాహనాలు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Read also: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్.. మరో ఆరుగురు..

మరోవైపు రుణమాఫీపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ అంతర్గత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తాజా మాజీ BRS పార్టీ ప్రతినిధులు, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీ అధికారులు పాల్గొన్నారు. పోటా పోటీగా సమావేశాలతో జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. పరస్పర దాడులు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరు పార్టీల కార్యాలయాలు, ప్రధాన కూడలి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిద్దిపేటను పోలీసులు వారి ఆధీనంలో తీసుకున్నారు.

Rana Daggubati: కారు ఆపి మరీ.. అభిమాని గుండెలపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన రానా!

Show comments