Site icon NTV Telugu

Harish Rao: ఆ చిన్నారి మాటలకి కంటతడి పెట్టుకున్న హరీష్ రావు..

Harish Rao

Harish Rao

Harish Rao: సిద్దిపేట పట్టణంలో విద్యార్థులకు భద్రంగా ఉండాలి.. భవిష్యత్ లో ఎదగాలి అవగాహన కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి మాట్లాడుతూ.. తన తండ్రి చనిపోయిన తల్లి చదివిస్తుందని కంటతడి పెట్టుకుంది. ఇక, ఆ చిన్నారి మాటలకి తల్లడిల్లిన ఆయన ఆ పాపను దగ్గరికి పిలిచి ఓదార్చాడు. సదరు చిన్నారితో పాటు హరీష్ రావు కంటతడి పెట్టుకున్నారు.

Read Also: KTR: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. కేటీఆర్ కీలక ఆదేశాలు

ఇక, హరీష్ రావు మాట్లాడుతూ.. జీవితమంటే మార్కులు, ర్యాంకులు కాదు.. జీవిత పాఠాలు నేర్పాలని మహాత్మా గాంధీ అన్నారు.. అమ్మ నాన్న చెప్పిన మాట వింటే తలెత్తుకొని బతుకుతారు అని తెలియజేశాడు. ఇక, స్టూడెంట్స్ సెల్ ఫోన్లు ఎక్కువగా వాడకండి.. పుస్తకాలు చదవండి అని పేర్కొన్నారు. అలాగే, మాతృభాషను మర్చిపోవొద్దు.. తెలుగు చదవడం, రాయడం నేర్చుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి అని హరీష్ రావు చెప్పుకొచ్చారు.

Exit mobile version