Terrible Incident: సిద్దిపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై ఓ కామాందుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆరుబయట ఆడుకున్న సమయంలో ఎత్తుకొనివెళ్లి అత్యాచారం చేశాడు. ఆడుకుంటున్న చిన్నారిపై తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్లు ఆ చిన్నారిని అక్కడే వదిలేసి పారిపోయాడు. చిన్నారి ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పటంతో షాక్ తిన్నారు. వెంటనే చిన్నారిని తీసుకుని వెళ్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిన్నారిపై అత్యాచారం చేసిన యువకుడు యూపీకి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు.
Read also: Bus Accident: భయానక రోడ్డు ప్రమాదం.. 30 మంది మృతి.. 23 మందికి గాయాలు..
ట్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఈ నెల 19న మైత్రివనంలో ఉండే మూడేళ్ళ చిన్నారిపై అత్యాచారం జరిగిందన్నారు. నేపాల్ కి చెందిన కుటుంబం అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నారని అన్నారు. తాతతో చిన్నారి ఆడుకుంటుండగా అక్కడే పెయింటింగ్ పని చేసే యూపీకి చెందిన అజయ్ చిన్నారిని ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశాడని పేర్కొన్నారు. అత్యాచారం తర్వాత నిందితుడు పారిపోయే యత్నం చేయగా పట్టుకోవడం జరిగిందని అన్నారు. నిందితుడిపై పొక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపామని అన్నారు.
Read also: Road Accident: కారు – ట్రక్కు ఢీ.. నలుగురు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం..
ప్రభుత్వం ఎన్ని చట్టాలు, కఠిన చర్యలు తీసుకుంటున్నా ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మానవ మృగాలకు మహిళలు బలవుతున్నారు. నెలరోజుల పసికందు నుంచి వృద్ధురాలి వరకు వేధింపులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై, చిన్న పిల్లలపై లైంగిక దాడులను అరికట్టాలంటే కఠినమైన చట్టాలు, విద్య విధానంలో మార్పు తేవాలి. కుటుంబ విలువలు నేర్పాలి. మన దేశంలో పేదరికం, అక్షరాస్యత పూర్తిగా నిర్మూలించడం అసాధ్యం. చదువుకున్న వాడికైతే సంస్కారం నేర్పగలము కానీ చదువుకున్నప్పటికీ మనసులో తప్పుడు ఆలోచనలు పెట్టుకున్న వాడికి, నాగరికత, సమాజం పట్ల బాధ్యత, భయం లేని వారికి ఎవరు నేర్పుతారు? దీనికి తోడు మొబైల్ ఫోన్లు కూడా మరొక కారణంగా మారుతున్నాయి. వీటి ద్వారా కన్న కూతురిపై కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కీచకులు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి. ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తే తప్పా సమాజంలో అత్యాచారాలకు ఆపలేమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trains Cancellation: బిగ్ అలర్ట్.. ఆ డివిజన్లలో పలు రైళ్లు రద్దు
