Siddipet : యాప్‌తో బయటపడిన యూరియా మాఫియా..!
- సిద్దిపేటలో యూరియా పంపిణీలో వరుస అక్రమాలు
- బైరాన్‌పల్లిలో రైతుకు అందాల్సిన 18 బస్తాలు మాయం
- యాప్ అలర్ట్‌తో బయటపడిన వ్యాపారుల నిర్వాకం
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddipet : సిద్దిపేట జిల్లాలో యూరియా పంపిణీ వ్యవహారం వరుస అక్రమాలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వం పారదర్శకత కోసం తీసుకువచ్చిన యాప్, వ్యాపారుల అక్రమాలను బట్టబయలు చేస్తోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు వ్యాపారులు, రైతులకు అందాల్సిన యూరియాను పక్కదారి పట్టిస్తూ, కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, వ్యాపారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చేర్యాల ఘటన మరువకముందే.. బైరాన్ పల్లిలో మరో అక్రమం
జిల్లాలోని చేర్యాలలో సుమారు 6,429 యూరియా బస్తాలు మాయమైన ఘటన మరువకముందే, తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బైరాన్ పల్లిలోని రైతు సేవా కేంద్రం నుంచి రైతుకు అందాల్సిన 18 యూరియా బస్తాలను నిర్వాహకుడు అక్రమంగా మాయం చేశాడు. ధూల్మిట్ట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన రైతు కుమార్, తన యూరియా బస్తాల కోసం బుక్ చేసుకున్నాడు. అయితే, తాను యూరియా తీసుకోకముందే, బస్తాలు తీసుకున్నట్లుగా ఫోన్‌కు మెసేజ్ రావడంతో సదరు రైతు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.
Also Read
నిలదీస్తే నిర్లక్ష్యపు సమాధానాలు.. ఆగని మాఫియా
ఈ అక్రమంపై రైతు కుమార్ రైతు సేవా కేంద్రం యజమానిని వెళ్లి నిలదీయగా, ఆయన ఏమాత్రం బాధ్యత లేకుండా నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. యూరియా అక్రమాలపై ఉన్నతాధికారులు అడపాదడపా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో యూరియా మాఫియా ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ యాప్‌లో వస్తున్న అలర్ట్‌లు అక్రమాలను బయటపెడుతున్నా, చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Siddipet : యాప్‌తో బయటపడిన యూరియా మాఫియా..!
-
Parliament: 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!.. 2 కీలక బిల్లులు ప్రవేశపట్టే అవకాశం
-
EPFO: ఉద్యోగులకు అలర్ట్.. క్లెయిమ్ చేయని EPF డబ్బు రూ.9,330 కోట్లు
-
Netflix: నెట్‌ఫ్లిక్స్ బంపర్ ఆఫర్: కొత్త కథా రచయితల కోసం క్రేజీ ఛాన్స్!
-
Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో ప్రజలపై అప్పుల మోత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్‌కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?