Hakimpet Sports School: లైంగిక వేధింపుల ఘటన.. తెలంగాణ సర్కార్ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hakimpet Sports School: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో రాత్రిపూట బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని కవిత అన్నారు. కవిత ట్వీట్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని వెంటనే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారులతో పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో మహిళలపై వేధింపులను ఉపేక్షించేది లేదని మంత్రి అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ట్విట్టర్ వేదికగా సమాచారం అందించారు. నిబంధనలకు విరుద్ధంగా స్పోర్ట్స్ స్కూల్లో బాలికలతో అధికారి దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాధితులు వాపోయారు.
Read also: Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్, ఏకంగా 20 రైళ్లు రద్దు..!
Also Read
బాలికల హాస్టల్‌కు రాత్రిపూట అధికారి వచ్చి వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్పోర్ట్స్ స్కూల్లో పనిచేసే మహిళా ఉద్యోగినితో సదరు అధికారి దందా నడుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి. స్పోర్ట్స్ స్కూల్లోని అమ్మాయిలను సాయంత్రం వినోదం కోసం తీసుకెళ్లేవాడు. ఈ స్పోర్ట్స్ స్కూల్లో శిక్షణకు వెళ్లే బాలికలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులపై నమ్మకంతో పిల్లలను వదిలి వెళ్లాల్సి వస్తుందని కానీ.. అధికారులే ఇలా కీచకంగా ప్రవర్తిస్తే ఎవరికి చెప్పుకోవాలని మండిపడుతున్నారు. ఇలాంటి వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాలపై అధికారిని ఎవరూ ప్రశ్నించలేదని బాధితులు చెబుతున్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ అంశంపై మీడియాలో వచ్చిన కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై మహిళా రెజ్లర్లు ఆరోపణలు చేశారు. ఈ విషయమై మహిళా రెజ్లర్లు కూడా ఆందోళనకు దిగారు. రెజ్లర్ల ఆందోళనల నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
Telangana Rains: తెలంగాణలో వర్షాలకు ఛాన్స్.. వచ్చే మూడ్రోజులు కురిసే అవకాశం
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!