NTV Telugu Site icon

MLA Rajaiah: చివరి నిమిషంలో ఏమైనా జరగొచ్చు.. ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

Mla Rajayyah

Mla Rajayyah

MLA Rajaiah: జనగామ జిల్లా స్టేషన్ ఘనపు నియోజకవర్గం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందస్తుగా ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో మార్పులు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదని.. ఏమైనా జరగొచ్చని కడియం శ్రీహరికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల అసెంబ్లీకి పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్ కేటాయించలేదు. అక్కడ మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్. దీంతో అసంతృప్తితో ఉన్న రాజయ్య నియోజకవర్గంలోని కార్యకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మహిళా ఆత్మీయ సమావేశంలో రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని రాజయ్య పరోక్షంగా హెచ్చరించిన ఆయన ఇల్లు అలకగానే పండుగ కాదని అన్నారు. బిడ్డ పుట్టుక ముందే కుళ్ల కుట్టినట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తన మీద అబద్ధాలు ప్రచారాలు చేస్తే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరికలు జారీ చేశారు. కాగా.. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సుప్రీం బాస్ అని.. ఇది గుర్తు పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు.

Read also: Heavy Rain: తెలంగాణకు రెయిన్ అలెర్ట్.. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే ఛాన్స్‌

ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చినా ఎమ్మెల్యే ద్వారానే రావాలన్నారు. జనవరి 17 వరకు తానే ఎమ్మెల్యేనని.. నియోజకవర్గానికి తానే బాస్ అని చెప్పారు. కొన్ని పథకాలను మూసివేస్తామని, భూదందాలు, బెదిరింపులు మొదలయ్యాయని, ఇది సరికాదన్నారు. అలాంటి వారి పట్ల బిఆర్ ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పదవులు కార్యకర్తలు ఇచ్చే భిక్ష అని.. కార్యకర్తలంటే నాయకులు భయపడాలన్నారు. పార్టీ కోసం ప్రాణత్యాగం చేశామని, సీఎం కేసీఆర్‌కు అండగా ఉన్నామన్నారు. 115 మంది అభ్యర్థులతో తుది జాబితా ప్రకటించలేదని కేసీఆర్ స్వయంగా చెప్పారని అన్నారు. మార్పులు చేర్పులు ఉంటాయని.. ఎన్నికల నాటికి ఏమైనా జరగవచ్చని అన్నారు. సీఎం కేసీఆర్ తనకు మరోసారి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు రాజయ్య వెల్లడించారు.
Bhadradri Kothagudem: అది బండి అనుకున్నావా బస్సు అనుకున్నావా.. స్కూటీపై 8 మందా!