Dr K Laxman: బీసీల పట్ల కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తుందని ఎంపీ రాజ్యసభ డా. లక్ష్మణ్ అన్నారు. బీసీలు సమాజంలో సగభాగం అన్నారు. కత్తి కంటే కాలం బలమైనదని ఒక నానుడి ఉందన్నారు. నిజాల వెలికితీత లో జర్నలిస్టుల కష్టం మామూలు కాదన్నారు. 50% కంటే ఎక్కువ ఉన్న బీసీల ఎదగకపోవాడమ్ దురదృష్టకరం అని తెలిపారు. బీసీలు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిపోయారన్నారు. ఓటును ఆయుధంగా ఉపయోగించి బీసీలను ఎదిగేలా చేసుకోవాలన్నారు. బీసీ జర్నలిస్టులు అంతా కూడా సోషల్ మీడియా వారియర్లుగా మారాలన్నారు. మీ యొక్క ఆలోచన విధానాలు సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరచాలని తెలిపారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య దేశంలో రిజర్వేషన్ల విషయంలో ఎవరు ఎలా ప్రవర్తించారో అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ బీసీ ల సంస్కేమం కోసం నెహ్రూ వద్ద ప్రతిపాదన పెడితే.. అందుకు నెహ్రూ ససేమీరా అన్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: Arvind Kejriwal: బెయిల్ ఇస్తే అధికారిక విధులు నిర్వహించొద్దు.. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు సూచన
17 సంవత్సారాలు అధికారంలో ఉన్న నెహ్రూ ఏ ఒక్క సారి కూడా ఆ అంశం పై స్పందించలేదన్నారు. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో రిజర్వేషన్ల పై కాంగ్రెస్ రాజకీయం చేస్తుందన్నారు. ఇందులో ఆన్న నిజాలను ఎవరు కూడా పూర్తి స్థాయిలో మీడియాలో చూపించడం లేదని తెలిపారు. కనీసం మీ లాంటి వాళ్ళు సోషల్ మీడియాలోనైనా చూపించాలని అన్నారు. మండల కమిషన్ కమిటీ సిఫార్స్ మీద ఇందిరా గాంధీ కూడా ఎప్పుడూ స్పందించలేదన్నారు. రాజీవ్ గాంధీ కూడా కులాల రిజర్వేషన్లను వ్యతిరేకించాడు.. మండల కమిషన్ నీ కూడా విభేదించారు రాజీవ్ గాంధీ.. అన్నారు. క్యాస్ట్ పేరుతో కాకుండా ఆర్థిక స్థితి గతులపై ఉద్యోగ రిజర్వేషన్ ఇవ్వాలని రాజీవ్ గాంధీ ప్రతిపాదించాడని తెలిపారు. నరేంద్ర మోడీ మొదటి సారి ప్రధాని అయ్యాక బిల్లు లోక్ సభలో పెట్టాడన్నారు. లోక్ సభలో బీజేపీకి బలం ఉండి బిల్ పాస్ అయ్యిందన్నారు. కానీ రాజ్యసభలో బిల్ ప్రవేశ పెడితే మాత్రం అక్కడ బీజేపీకి బలం లేదన్నారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు వ్యతిరేకించడంతో అక్కడ బిల్ పాస్ కనివ్వలేదన్నారు. కానీ మోడీ మాత్రం పట్టు వదలకుండా రాజ్యసభలో బీజేపీకి బలం చేకూరాక బిల్ పాస్ చేయించాడన్నారు.
Read also: Heavy Rain: పశ్చిమ బెంగాల్ లో భారీ వర్షం.. 12 మంది మృతి
మోడీ వచ్చాకే రిజర్వేషన్లు అమలుకు నోచుకున్నాయన్నారు. ఆనాడు బీసీల పట్ల కాంగ్రెస్ కి చిన్న చూపన్నారు. 27% నీట్ లో బీసీలకు రిజర్వేషన్ పెంచింది ప్రధాని మోడీ అన్నారు. ఈ బీసీలకు ఎంబిబిఎస్ చదవడానికి ఈ నీట్ ఎంతగా దోహత పడుతుంది ఆలోచించాలని తెలిపారు. జమ్ము కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు కాకముందు బీసీలకు రిజర్వేషన్ లేక ఇబ్బంది పడింది మీ ప్రభుత్వంలో కాదా..? అని ప్రశ్నించారు. మోడీ ఆర్టికల్ 370 రద్దు చేసాకా అక్కడ బీసీలు ఇప్పుడు రిజర్వేషన్లు వినియోగించుకుంటున్నారని తెలిపారు. అత్యధికంగా బీసీ ఎంపీలు బీజేపీలో ఉన్నారని తెలిపారు. బీసీల పట్ల కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తుందని మండిపడ్డారు. బీసీ కమిషన్ రిజర్వేషన్ లెక్కలు తేలిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు బిజెపి పాలిత రాష్ట్రాల్లో సిద్ధంగా ఉందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లిం లకు కల్పించిన రిజర్వేషన్ వల్ల బీసీలు నష్టపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు బీసీల కోటాలో రిజర్వేషన్ కాజేస్తున్నారంటే అందుకు కారణం కాంగ్రెస్ కదా? అని ప్రశ్నించారు. ఫసియుద్దీన్ కూడా బీసీ కోటాలో డిప్యూటీ మేయర్ అయ్యాడని గుర్తు చేశారు.
Read also: CM Revanth Reddy: రాజకీయంగా లాభం పొందేందుకే ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు..
నా ప్రాణమున్నంత వరకు రాజ్యాంగం మారదు అని మోడీ అంటున్నాడన్నారు. కానీ కాంగ్రెస్ పని కట్టుకుని మోడీ రాజ్యాంగం రద్దు చేస్తాడని దృష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం మార్చాలని మాట్లాడిన కెసిఆర్ పై ఎందుకు కాంగ్రెస్ మాట్లాడం లేదన్నారు. బీసీల్లో వెనుకబడిన కమ్మరి, కుమ్మరి చేతి వృత్తి కులస్తులు ఎదిగేలా అవకాశాలు కల్పించాలన్నారు. తెలంగాణ ఏర్పడితే చిన్న కులాలు భాగుపడుతాయని అనుకున్నాను.. కానీ కనీసం వారి పార్టీలో బీసీలు కనీసం పార్టీ అధ్యక్షుడు కూడా అయ్యే అవకాశం లేకుండా పోయిందన్నారు. నాలాంటి ఒక సామాజిక కార్యకర్త పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా మోడీ అవకాశం ఇచ్చాడన్నారు. మోడీకి బీసీలపై ఎలాంటి ఆప్యాయత ఉందో ఈ ఒక్క విషయం చూస్తే అర్థం అవుతుందన్నారు. మోడీ ప్రభుత్వం ముందు 9 మంది ప్రొఫెసర్లు మాత్రమే యూనివర్సిటీ ల్లో ఉండేవారన్నారు. కానీ మోడీ ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఇప్పుడు 9 వేల మంది బీసీ ప్రొఫెసర్లు ఉన్నారని తెలిపారు. అంటే అప్పుడు కాంగ్రెస్ హాయంలో బీసీల్లో చదువుకున్న గొప్ప వారు లేరా అని మీ ఉద్దేశ్యం అన్నారు. ఇవేమీ పట్టకుండా రాహుల్ గాందీ అర్ధ లేని మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Annamalai: కాంగ్రెస్ కు రామమందిరాన్ని తాకే హక్కు కూడా లేదు..
