ఉద్యోగులు, టీచర్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఉసురు పోసుకుంటోందని మండిపడ్డారు. 317 జీఓ కారణంగా ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీసి, సీనియర్, జూనియర్ల మధ్య ద్వేష భావాన్ని పెంచుతున్నారని ఆరోపించారు. 317 జీవో విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు సైతం నాటకాలు ఆడుతున్నారని సీతక్క అన్నారు.
Read Also: బీజేపీపై హరీశ్‌రావు చేస్తున్న ప్రకటనలు నిరాధారమైనవి: కృష్ణ సాగర్ రావు
కేంద్ర ప్రభుత్వం తల్చుకుంటే ఆ జీవోను రద్దు చేసే అవకాశం ఉన్నా బీజేపీ అనవసర రాజకీయం చేస్తుందన్నారు. ప్రాణాలు తీసుకోవద్దని ఉద్యోగులను సీతక్క కోరారు. కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతులు ఎంత సంతోషంగా ఉన్నారన్న విషయం నిన్న మంత్రుల పర్యటనతో బయటపడిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం 317 జీవోను సవరించి ఉద్యోగులకు మేలు కలిగేలా చూడాలని సీతక్క ప్రభుత్వాన్ని కోరారు.
