Vande Bharat Train: తెలంగాణ రాష్ట్రానికి మరో వందేభారత్ ట్రైన్ రాబోతోంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ నడుస్తోంది. ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది భారత రైల్వే. సికింద్రాబాద్-నాగ్ పూర్ మధ్య వందేభారత్ రైలు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పటికే ఈ రూట్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్స్ పూర్తయ్యాయి. సాధారణ కార్యకలాపాలకు అనువుగా ఉందని రైల్వే శాఖ నిర్థారణకు వచ్చింది.