Site icon NTV Telugu

PM Modi Hyderabad tour: మోడీ వేదిక పై ఆ ఇద్దరికీ సీట్లు.. వాళ్ళు వెళతారా మరి?

Cm Kcr, Modi

Cm Kcr, Modi

PM Modi Hyderabad tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. తెలంగాణలో రూ.11,300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. అక్కడి నుంచి వర్చువల్‌గా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి.

కానీ మోడీ అధికారిక పర్యటన కావడంతో పరేడ్ గ్రౌండ్‌లో ఆయన పాల్గొనే బహిరంగ సభకు ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీతో పాటు పలువురికి ప్రోటోకాల్‌ ప్రకారం కుర్చీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి (స్థానిక ఎంపీ)తో పాటు మరికొంత మందిని వేదికపై కూర్చోబెట్టారు. కాగా, అధికారిక పర్యటన సందర్భంగా కేసీఆర్‌కు ప్రధాని మోదీ ఆహ్వానం పంపారు. అలాగే మధ్యాహ్నం 12.30 నుంచి 12.37 గంటల వరకు కేసీఆర్ వేదికపై మాట్లాడేందుకు సమయం కేటాయించారు.

అయితే గతంలో మాదిరిగానే ఈసారి కూడా ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ప్రధాని పర్యటనకు ఆహ్వానిస్తున్న మంత్రిగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నియమించింది. దీంతో బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని స్వాగతం పలకనున్నారు. అలాగే తిరిగి వెళ్లేటప్పుడు వీడ్కోలు పలుకుతారు. ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్ మీటింగ్ కు కేసీఆర్ దూరంగా ఉంటారని బీఆర్ ఎస్ వర్గాలు తెలిపాయి. అయితే సభా వేదికపై ప్రొటోకాల్‌ ప్రకారం కుర్చీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
IPL 2023 : నువ్వా నేనా చూసుకుందాం.. చెన్నైతో ముంబై ఢీ

Exit mobile version