NTV Telugu Site icon

Vaishali Kidnap Case: వైశాలి కిడ్నాప్ కేసు.. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌

Vaishali Case

Vaishali Case

Vaishali Kidnapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన వైశాలి కిడ్నాప్ కేసు రోజురోజుకు మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం నవీన్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నాడు. రంగారెడ్డి కోర్టు అనుమతితో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు సీన్ రీ కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఆ తర్వాత నవీన్ రెడ్డిపై గతంలో ఉన్న కేసుల వివరాలను కోరుతున్నారు. నిన్న శనివారం ఉదయం జైలు నుండి ఆదిభట్ల పీ.ఎస్.కు నవీన్ రెడ్డి నీ పోలీస్ లు తరలించారు.

Read also: Tollywood: టాలీవుడ్‌ లో వరుస విషాదాలు.. నలుగురు దిగ్గజ నటులు కన్నుమూత

శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో హస్తినాపురం మిస్టర్ టీ పాయింట్ నుండి మన్నే గూడ లోని వైశాలి ఇంటి వరకు నవీన్ రెడ్డి చేత ఆదిభట్ల పోలీస్ లు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. వైశాలి ఇంటి పై దాడికి ముందు ఏం జరిగింది అన్నది పోలీస్ ల ముందు విచారణలో ఒక్కొక్కటి ఒప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. వైశాలి ఇంటి ముందు వున్న షెడ్ లో రిపేర్ చేయాలంటూ మిస్టర్ టీ కి చెందిన వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టీ అందరినీ పిలిపించుకున్నట్లు నవీన్ రెడ్డి తెలిపాడు.. వైశాలిని కిడ్నాప్ చేశాక… కార్ లో వైశాలి పై విచక్షణా రహితంగా దాడి చేసినట్టు కస్టడీ విచారణ లో నిందితుడు నవీన్ రెడ్డి ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇవాళ కిడ్నాప్ తరువాత హై వే లో వెళ్లిన రూట్ ను.. ఆదిభట్ల పోలీస్ లు.. రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు.

Read also: Fake Swamiji: ఓర్నీ.. ఏంది సామీ ఇదీ.. విగ్రహాలను కొట్టేసింది నువ్వేనా!

కిడ్నాప్ కేసులో ఏ1 నిందితుడు నవీన్ రెడ్డిని విచారించేందుకు 8 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇబ్రహీంపట్నం కోర్టు ఒకరోజు కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో పోలీసులు జిల్లా కోర్టును ఆశ్రయించగా 3 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారు. నిందితుడు నవీన్ రెడ్డిని శనివారం చర్లపల్లి జైలు నుంచి అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
Bandi Sanjay: అటల్ స్పూర్తితో మోడీ పాలన సాగిస్తున్నారు

Show comments