Vaishali Kidnap Case: వైశాలి కిడ్నాప్ కేసు.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaishali Kidnapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన వైశాలి కిడ్నాప్ కేసు రోజురోజుకు మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం నవీన్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నాడు. రంగారెడ్డి కోర్టు అనుమతితో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు సీన్ రీ కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఆ తర్వాత నవీన్ రెడ్డిపై గతంలో ఉన్న కేసుల వివరాలను కోరుతున్నారు. నిన్న శనివారం ఉదయం జైలు నుండి ఆదిభట్ల పీ.ఎస్.కు నవీన్ రెడ్డి నీ పోలీస్ లు తరలించారు.
Read also: Tollywood: టాలీవుడ్ లో వరుస విషాదాలు.. నలుగురు దిగ్గజ నటులు కన్నుమూత
Also Read
శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో హస్తినాపురం మిస్టర్ టీ పాయింట్ నుండి మన్నే గూడ లోని వైశాలి ఇంటి వరకు నవీన్ రెడ్డి చేత ఆదిభట్ల పోలీస్ లు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. వైశాలి ఇంటి పై దాడికి ముందు ఏం జరిగింది అన్నది పోలీస్ ల ముందు విచారణలో ఒక్కొక్కటి ఒప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. వైశాలి ఇంటి ముందు వున్న షెడ్ లో రిపేర్ చేయాలంటూ మిస్టర్ టీ కి చెందిన వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టీ అందరినీ పిలిపించుకున్నట్లు నవీన్ రెడ్డి తెలిపాడు.. వైశాలిని కిడ్నాప్ చేశాక… కార్ లో వైశాలి పై విచక్షణా రహితంగా దాడి చేసినట్టు కస్టడీ విచారణ లో నిందితుడు నవీన్ రెడ్డి ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇవాళ కిడ్నాప్ తరువాత హై వే లో వెళ్లిన రూట్ ను.. ఆదిభట్ల పోలీస్ లు.. రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు.
Read also: Fake Swamiji: ఓర్నీ.. ఏంది సామీ ఇదీ.. విగ్రహాలను కొట్టేసింది నువ్వేనా!
కిడ్నాప్ కేసులో ఏ1 నిందితుడు నవీన్ రెడ్డిని విచారించేందుకు 8 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇబ్రహీంపట్నం కోర్టు ఒకరోజు కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో పోలీసులు జిల్లా కోర్టును ఆశ్రయించగా 3 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారు. నిందితుడు నవీన్ రెడ్డిని శనివారం చర్లపల్లి జైలు నుంచి అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
Bandi Sanjay: అటల్ స్పూర్తితో మోడీ పాలన సాగిస్తున్నారు
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!