NTV Telugu Site icon

Ameenpur: అమీన్పూర్లో ముగ్గురు పిల్లలను చంపిన తల్లి.. ఎస్పీ రియాక్షన్..!

Ameenpur

Ameenpur

Ameenpur: అమీన్పూర్లో పిల్లల హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. చావు బతుకుల మధ్య ఉన్న రజిత స్టేట్మెంట్ ను పోలీసులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాత్రి షాప్ నుంచి పెరుగు తెచ్చుకున్నాం.. ఆ పెరుగుని నలుగురం కలిసి తిన్నాం.. నా గొంతులో ఏదో పట్టుకున్నట్లు అయింది.. అందరం కింద పడిపోయాం.. ఏం జరిగిందో నాకు తెలియదు.. నా పిల్లలకి ఏమైనా అయిందా అని రజిత అడిగింది. అయితే, తాను ఎలాంటి విష పదార్థాలు చిన్నారులకు ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. చిన్నారులు మృతి చెందడం, ఆమె ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చెందడం వెనుక ఉన్న కారణాలేంటి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పెరుగు అన్నం తిన్నామని పోలీసులకు చెప్పిన రజిత.. ఇంట్లో డస్ట్ బిన్ లో పెరుగు ప్యాకెట్ ను స్వాధీనం చేసుకున్నారు. హెరిటేజ్ పెరుగు ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Trump: వైట్‌హౌస్‌లో ట్రంప్ ఇఫ్తార్ విందు.. ముస్లింలకు ట్రంప్ ప్రత్యేక కృతజ్ఞతలు

అలాగే, చిన్నారుల తండ్రి చెన్నయ్యను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. చిన్నారుల మృతి మిస్టరీగా ఉండటంతో చెన్నయ్యను ఆరా తీస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు, తగాదాలు లేవని స్థానికులు చెప్తున్నారు. రజిత చాలా మంచిదని, పిల్లలను కూడా ప్రేమగా చూసుకుంటుందని తెలిపారు. అయితే, చెన్నయ్యకు రజిత రెండవ భార్య.. చెన్నయ్య, రజిత దంపతుల సంతానమే ఈ ముగ్గురు చిన్నారులు అని స్థానికులు పేర్కొన్నారు.

Read Also: Minister Narayana: మున్సిపాలిటీల్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్.. మంత్రి నారాయణ సమీక్ష

ఇక, ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా ఎస్సీ పరితోశ్ పంకజ్ మాట్లాడుతూ.. ఏం జరిగింది అన్న విషయం ఇంకా పూర్తిస్థాయిలో తెలవదు.. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే ఎలా చనిపోయారన్న విషయం తెలుస్తుంది.. రజిత, చెన్నయ్యలను ఇంకా పూర్తి స్థాయిలో విచారించలేదు.. ఏ విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు. కాగా, రాఘవేంద్ర కాలనీలోని ఇంటి నుంచి మరికొద్ది సేపట్లో చిన్నారులను మార్చురీకి తరలించనున్నాం.. చిన్నారులు చనిపోవడానికి గల కారణాలు పోస్టుమార్టం రిపోర్ట్ లో తెలియనుంది.. ఈ ఘటనలో పోస్టుమార్టం రిపోర్టే కీలకం కానుందని ఎస్పీ పరితోశ్ పంకజ్ చెప్పుకొచ్చారు.