Site icon NTV Telugu

Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!

Ratnagiri

Ratnagiri

Sangareddy: సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలంలో ఒక విద్యాసంస్థలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హోంవర్క్ చేయలేదన్న కారణంతో పాలిటెక్నిక్ విద్యార్థులపై HOD కేబుల్ వైర్లతో దాడి చేశాడు. ఈ ఘటన తుర్కల ఖానాపూర్ శివారులో ఉన్న రత్నపురి ఇనిస్టిట్యూట్‌లో చోటుచేసుకుంది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం, హోంవర్క్ పూర్తి చేయలేదని ఆగ్రహించిన హెచ్‌ఓడీ శివారెడ్డి ఏకంగా 15 మంది విద్యార్థులను కేబుల్ వైర్లతో విచక్షణ రహితంగా కొట్టినట్లు తెలిపారు. తీవ్రంగా కొట్టడంతో పలువురు విద్యార్థుల కాళ్లపై వాతలు వచ్చాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Ashwin: వరల్డ్ కప్ హీరో సంజుపై కోపంగా ఉన్న అశ్విన్.. అసలేం జరిగిందంటే?

అంతేకాకుండా, కొట్టడమే కాకుండా తమపై ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన తల్లిదండ్రులు, విద్యార్థులపై దాడి చేసిన హెచ్‌ఓడీ శివారెడ్డిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాసంస్థలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

PPF Scheme: అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.150తో చేతికి రూ.24 లక్షలు!.. రిస్క్ జీరో

Exit mobile version