Sangareddy: సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. ఐదుగురు అరెస్ట్, పరారీలో మరో నలుగురు..
- సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ..
- ప్రభుత్వ భూమి అమ్మకానికి పెట్టి నకిలీ NOC క్రియేట్..
- అడ్డంగా దొరికిపోయిన గ్యాంగ్- పరారీలో మరో నలుగురు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy: ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు ఓ ముఠా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న రామచంద్రపురం తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి విచారణ చేసి కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
1984లో కొల్లూరులోని సర్వే నంబర్ 191లో 74మంది ఫ్రీడమ్ ఫైటర్స్ కి రెండెకరాల చొప్పున ప్రభుత్వం భూమి కేటాయించింది. కొన్ని రోజుల కింద కొన్ని కారణాలతో అందులో రెండెకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. టేక్మాల్ కి చెందిన ఐదుగురు స్వాతంత్ర్య సమరయోధుల వారసులు ముఠాగా ఏర్పడి ఆ రెండెకరాల భూమిని విక్రయానికి పెట్టారు. హైదరాబాద్ కి చెందిన ఓ వ్యక్తికి 40 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ చేసుకుని రూ.3 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. NOC కావాలని భూమి కొనుగోలుదారు శరతుపెట్టాడు. దీంతో ఫ్రీడమ్ ఫైటర్స్ సన్స్ కు ఏం చేయాలో అర్థంకాలేదు. కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కలెక్టరేట్ లో బ్రోకర్ గా పనిచేసే శ్రీనివాస చారిని కలిశారు.
Also Read
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
Read also: New EV Policy In Telangana: తెలంగాణలో నేటి నుంచి నూతన ఈవీ పాలసీ..
శ్రీనివాసచారితో మరికొందరు కేటుగాళ్ళు కలిసి కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫేక్ NOC క్రియేట్ చేశారు. కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసిన విషయం బయటికి రావడంతో రామచంద్రపురం తహశీల్దార్ సంగ్రామ్‌రెడ్డి ఈనెల 14న కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని వీరేశం, రాములు, సుధాకర్, నాగరాజు, సంతోష్ లను (ఐదుగురిని) అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు నిందితులు ప్రయత్నించారని రామచంద్రపురం తహసీల్దార్ సంగ్రామ్‌రెడ్డి స్పష్టం చేశారు. స్వాతంత్య్ర సమరయోధులకు భూములిచ్చామని, అయితే ప్రభుత్వం ఇప్పటికే వెనక్కి తీసుకుందని అన్నారు. ఇటీవలే విధుల్లో చేరారని, ఆ భూమిని ఎందుకు వెనక్కి తీసుకున్నారనేది రికార్డులు పరిశీలించాల్సి ఉందన్నారు.
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!