NTV Telugu Site icon

Sangareddy: ఇన్స్టాగ్రామ్లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారం

Rape

Rape

ఈ మధ్య కాలంలో ఆన్​లైన్​ పరిచయాలు కొంపముంచుతున్నాయి. ఇన్స్టాగ్రామ్​, ఫేస్ బుక్​, వాట్సాప్​ లాంటి సామాజిక మాధ్యమాల్లో పరిచయాన్ని పెంచుకుని మాయమాటలు చెప్పి నయవంచనకు పాల్పడుతున్నారు కొంతమంది. సోషల్ మీడియాలో పరిచయం కాస్త.. అత్యాచారం వరకూ వెళ్లిపోతున్నాయి. కొందరు నిజాయితీతో స్నేహం చేస్తుంటే.. మరికొందరు కామాంధులు ప్రేమ పేరుతో అమ్మాయిలను లొంగదీసుకుంటున్నారు. ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేస్తూ వారి కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే.. సోషల్ మీడియా అనేది ఇలాంటి వాళ్లకు అడ్డాగా మారింది. అందమైన అమ్మాయిలను ఎర వేసి పడేయడం.. ఆ తర్వాత వారి కోరికలను తీర్చుకోవడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే..

Read Also: Sangareddy: బంగారం కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు..

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌లో దారుణం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమై ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఇన్‌స్టాలో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ (మం) జివంగి గ్రామానికి చెందిన చెందిన వినీల్ (19), న్యాల్కల్‌కి చెందిన ఓ బాలిక(16) పరిచయం ఏర్పడింది. ఏడు నెలలుగా ప్రేమ పేరుతో ఇన్‌స్టాలో బాలికతో చాటింగ్, కాల్స్ చేశాడు. కాగా.. ఇటీవల యువకుడు బాలిక గ్రామానికి వచ్చి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో.. యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.

Read Also: Jai Hanuman Theme Song: ‘జై హనుమాన్’ థీమ్ సాంగ్ వచ్చేసిందోచ్