Missing Schoolgirls : మిస్టరీకి ఎండ్.. మాయమైన బాలికలు.. సేఫ్‌గా దొరికారు.!
- పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి అదృశ్యం
- పోలీసుల వేగవంతమైన గాలింపు
- సికింద్రాబాద్‌లో సురక్షితంగా గుర్తింపు
- తల్లిదండ్రులకు అప్పగించనున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Missing Schoolgirls : సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో ఇటీవల అదృశ్యమైన బీహార్‌కు చెందిన నలుగురు బాలికల మిస్సింగ్ కేసుకు పోలీసులు సుఖాంతం పలికారు. ఈనెల 23న స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లిన ఈ విద్యార్థినులు సాయంత్రానికైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి విచారించారు. అయితే ఆ రోజు విద్యార్థినులు అసలు బడికే రాలేదని పాఠశాల సిబ్బంది తెలపడంతో, వారు వెంటనే పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టగా, ఈ రోజు నలుగురు బాలికలను సికింద్రాబాద్‌లో సురక్షితంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అదృశ్యమైన విద్యార్థినులను కుష్బూ కుమారి (16), మహిమా కుమారి (12), రోజా కుమారి (12), ప్రియా కుమారి (12)గా పోలీసులు ధ్రువీకరించారు. వీరంతా ఇస్నాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారని, ప్రస్తుతం నలుగురు బాలికలు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. చురుగ్గా వ్యవహరించి బాలికలను కనిపెట్టిన పటాన్చెరు పోలీసులు, అన్ని ప్రక్రియలు పూర్తి చేసి మరికొద్ది సేపట్లో వారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. దీంతో గత రెండు రోజులుగా తీవ్ర భయాందోళనలో ఉన్న బాలికల కుటుంబ సభ్యులు , స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read
- TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
- Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!