Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Sahithi Infra Scam Charge Sheet Ccs Hyderabad

HYD: సాహితీ ఇన్‌ఫ్రా స్కాంపై ఛార్జ్‌షీట్‌ దాఖలు

Published Date :January 5, 2026 , 8:25 pm
By Gogikar Sai Krishna
  • రూ.3,000 కోట్ల సాహితీ ఇన్‌ఫ్రా స్కామ్‌పై ఛార్జ్‌షీట్
  • ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో వేల మందికి మోసం
  • శర్వాణి ఎలైట్ ప్రాజెక్టులో 17 కేసులు
  • 13 మందిపై అభియోగాలు.. బాధితుల్లో ఆశలు
HYD: సాహితీ ఇన్‌ఫ్రా స్కాంపై ఛార్జ్‌షీట్‌ దాఖలు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ అమాయక ప్రజలను బురిడీ కొట్టించిన సాహితీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కేసులో సిసిఎస్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ స్కామ్ విలువ ఏకంగా రూ. 3,000 కోట్లు ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం గమనార్హం.

సాహితీ ఇన్‌ఫ్రా అధినేత లక్ష్మీనారాయణ ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో భారీగా నిధులు వసూలు చేశారు. తక్కువ ధరకే ప్లాట్లు , ఫ్లాట్లు ఇస్తామంటూ నమ్మబలికి వేల మంది బాధితుల నుండి డబ్బులు వసూలు చేశారు. అయితే, వసూలు చేసిన ఈ మొత్తాన్ని ప్రాజెక్టుల కోసం వాడకుండా, తన సొంత ప్రయోజనాల కోసం మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు.

Also Read

  • Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
  • Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
  • PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
  • Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్‌రెడ్డి
Add as a preferred
source on google

ఈ స్కామ్‌లో భాగంగా మొత్తం 64 కేసులు నమోదు కాగా, పోలీసులు అన్నింటిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా అమీన్‌పూర్‌లోని ‘శర్వాణి ఎలైట్’ ప్రాజెక్టుకు సంబంధించి 17 కేసులు నమోదయ్యాయి. ఈ 17 కేసులకు సంబంధించి పోలీసులు తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఒక్క శర్వాణి ఎలైట్ పేరుతోనే బాధితుల నుండి రూ. 500 కోట్ల పైచిలుకు వసూలు చేసినట్లు సిసిఎస్ పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.

ఈ భారీ స్కామ్‌లో కేవలం లక్ష్మీనారాయణ మాత్రమే కాకుండా, అతనికి సహకరించిన మొత్తం 13 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేస్తూ ఛార్జ్ షీట్ రూపొందించారు. వేల మంది బాధితులు తమ కష్టార్జితం తిరిగి వస్తుందని నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న తరుణంలో, పోలీసుల ఈ చర్య బాధితుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. సాహితీ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా పక్కా ఆధారాలతో కోర్టు ముందు హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు.

Trivikram-Sunil : ఒకే రోజున పెళ్లి చేసుకున్న త్రివిక్రమ్-సునీల్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CCS Police
  • Hyderabad Real Estate Scam
  • Real Estate Fraud
  • sahithi infra scam
  • Sahithi Infrastructure

తాజావార్తలు

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!

  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్

  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం

  • Manity: వేల కోట్ల టార్గెట్’తో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ?

  • Mango Sharbat : ఎండవేడిని తరిమికొట్టే ‘మామిడి పండ్ల షర్బత్’.. ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండి.!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions