Site icon NTV Telugu

Dr Vasanth Kumar: మంత్రి హరీష్‌రావుతో ఆర్ఎస్ఎస్డీఐ అధ్యక్షులు డాక్టర్‌ వసంత్‌కుమార్‌ భేటీ..

Dr Vasanth Kumar

Dr Vasanth Kumar

హైదరాబాద్‌లో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావును కలిశారు.. రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా (ఆర్ఎస్ఎస్డీఐ) అధ్యక్షులు డాక్టర్‌ వసంత్‌కుమార్‌.. ఈ సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఎయిమ్స్‌లో డయాబెటిస్‌పై విడుదల చేసిన బ్లూ బుక్‌ను ఆయనకు అందించారు, డయాబెటీస్‌ను నివారించడంలో.. రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా.. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడంతోపాటు మధుమేహ నిర్వహణలో ఆరోగ్య సంరక్షణ నిపుణులకు శిక్షణ ఇవ్వడం గురించి చర్చించారు. కాగా, రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే మధుమేహ వైద్య సదస్సులను నిర్వహించింది ఆర్ఎస్ఎస్డీఐ.. వివిధ విభాగాల్లో ప్రఖ్యాతిగాంచిన వైద్య నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు.. మధుమేహ వ్యాధి చికిత్సలో ఎదురవుతున్న సవాళ్లు, నూతన ఆవిష్కరణలు, ఆధునిక చికిత్సా విధానాల గురించి విస్తృతంగా చర్చ జరుపుతూ వస్తోంది ఆర్ఎస్ఎస్డీఐ.. వైద్య విధానాల గురుంచి అవగాహన పెంపొందించుకునేందుకు, నూతన చికిత్సా పద్ధతులను అభ్యసించేందుకు వైద్య విద్యార్థులకు ఈ సదస్సులో ఎంతో ఉపయోగపడినట్టు గతంలోనే విద్యార్థులు తెలిపారు.

Read Also: GVL Narasimha Rao: ప్రధాని మోడీని కలిసిన ఎంపీ జీవీఎల్‌.. విశాఖకు రావాలని విజ్ఞప్తి..

Exit mobile version