NTV Telugu Site icon

R.S.Praveen Kumar: ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయి

Rs Pravven Kumar

Rs Pravven Kumar

R.S.Praveen Kumar: ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయని RS ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి తెలంగాణ కొందరి తెలంగాణగా మారిందని ఆరోపించారు. నిరుద్యోగ సమస్య ఎంతో తీవ్రంగా ఉందని మండిపడ్డారు. ఢిల్లీ లో తెలంగాణ బిడ్డలు అవస్థలు పడుతున్నారని, తన బిడ్డ కోసం మంత్రులను, అధికారులను ఢిల్లీ కి పంపాడని అన్నారు. లీకేజీ మూలాలు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. 30 లక్షల మంది జీవితాలు ఉండాల్సిన గది లోకి వేరే వాళ్ళు ఎలా వెళతారు? అని ప్రశ్నించారు. రూల్ 16 ప్రకారం కేవలం చైర్మన్ కు మాత్రమే ప్రింటింగ్ కు అధికారం ఉందని గుర్తు చేశారు. వెబ్సైట్ హాక్ అవలేదు, అవు స్టాండర్డ్ కంప్యూటర్స్, నెట్వర్కింగ్ కంప్యూటర్స్ కాదు.. జనార్ధన రెడ్డి ప్రతి విషయాన్ని చిన్నదిగా చూపిస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్‌ బంధువులే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో బోర్డ్ మెంబెర్స్ గా ఉన్నారని ఆరోపణలు గుప్పించారు.

Read also: Police Vs Revenue: గుడివాడలో పోలీస్ వర్సెస్ రెవిన్యూ

ప్రతి విషయాన్ని చాలా చిన్నదిగా చూపిస్తున్నారని అన్నారు. కేవలం ప్రవీణ్, రాజశేఖర్ లు మాత్రమే కాదు… దీని మూలాలు సీఎం ఆఫీస్ లో ఉన్నాయని సంచలన వ్యాఖ్యలుచేశారు. సిట్ కు 30 లక్షలు మంది జీవితాలు ఇచ్చారు. కేటీఆర్ పరోక్షంగా ప్రవీణ్, రాజశేఖర్ దాటి దర్యాప్తు ముందుకు పోకుండా ఆదేశాలు జారీ చేశారని అన్నారు. కాన్ఫిడెసియల్ రూం లోకి వేరే వారికి ఎంట్రీ ఉండదని స్పష్టం చేశారు. సింగరేణి రిక్రూట్ మెంట్ స్కాం జరిగింది, ఎటువంటి ఆక్షన్ తీసుకోలేదని మండిపడ్డారు. రజత్ కుమార్ బిడ్డ పెళ్లికి మెగా కృష్ణారెడ్డి 50 లక్షలుతో ఫలకనుమ పాలస్ లో పెళ్లి జరిపితే ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. మామూలు ఉద్యమాలు సరిపోవు, 2009 లాంటి ఉద్యమాలు జరగాలని నిప్పులు చెరిగా. ఐక్య వేదిక ఉండాలి… ప్రజల దగ్గరికి వెళ్ళాలని పిలుపు నిచ్చారు. మిలియన్ మార్చ్ తరహా ఉద్యమాలు రావాలని, బలమైన ఐక్య వేదిక కావాలి… ఒక గొప్ప ఉద్యమానికి నాంది కావాలని పిలుపు నిచ్చారు. విద్యార్థులను, ఉద్యోగార్థులును కాపాడే ఉద్యమం కావాల ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమారు అన్నారు.
ABVP Protest: ప్రగతిభవన్‌ వద్ద ఉద్రిక్తత.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై ఏబీవీపీ నిరసన..