Gajwel: గజ్వేల్‌లో పట్టుబడ్డ నగదు.. రూ.50 లక్షలు సీజ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gajwel: గజ్వేల్ పట్టణంలో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టుబడింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో గజ్వేల్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బచ్చు రత్నాకర్‌కు చెందిన కారు (టీఎస్36సీ 0198)లో రూ.50 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు స్వాధీనం చేసుకోలేదు. ఈ సందర్భంగా గజ్వేల్ సీపీ అనురాధ మాట్లాడుతూ రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లరాదని సూచించారు. అధికంగా తీసుకెళ్లినట్లయితే సరైన పత్రాలను వెంట ఉంచుకోవాలి. లేని పక్షంలో ఆ మొత్తాన్ని సీజ్ చేస్తామని తెలిపారు. డబ్బును ఐటీ శాఖకు అప్పగిస్తామని, సరైన ధ్రువపత్రాలు చూపించి బాధితులు విడిపించుకోవచ్చని తెలిపారు.
Read also: Kaushik Reddy: పొన్నం ప్రభాకర్ ను ఆవేశం స్టార్ అని పిలవాలి..
Also Read
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
ఎన్నికల్లో డబ్బు ప్రభావానికి అడ్డుకట్ట వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం. బ్యాంకుల నుంచి రూ.లక్ష దాటిన లావాదేవీలపై నిఘా ఉంచాలని రాష్ట్రాలకు ఈసీ లేఖ రాసింది. బ్యాంకు ఖాతాల నుంచి విత్‌డ్రా, డిపాజిట్ల వివరాలపై ఆరా తీయాలని సూచించారు. దేశవ్యాప్తంగా లోక్ సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు లేఖ రాశారు. జిల్లా ఎన్నికల అధికారులు అన్ని బ్యాంకుల నుంచి రూ.లక్షకు పైగా లావాదేవీల వివరాలను తీసుకురావాలి.వాటిని విశ్లేషించే బాధ్యత సంబంధిత సిబ్బందికి అప్పగించాలి.ఎన్నికల సందర్భంగా ఒకే బ్యాంకు శాఖ నుంచి వివిధ బ్యాంకులకు నగదు బదిలీ అవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
కాగా.. ఓటర్లను ప్రభావితం చేసేందుకు వివిధ మార్గాల ద్వారా నగదు లావాదేవీలు చేపట్టే అవకాశం ఉంది. రాజకీయ పార్టీల ఖాతాల నుంచి తీసుకునే లావాదేవీలను పర్యవేక్షించాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి బ్యాంకు ఖాతాల నుంచి అతని భార్య, అభ్యర్థిపై ఆధారపడిన వ్యక్తి లక్షకు పైగా లావాదేవీలను అఫిడవిట్‌లో నమోదు చేయాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లో వివరాలను అందుబాటులో ఉంచాలి. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రెండు నెలల ముందు జరిగిన లావాదేవీలను నిశితంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేయాలి. రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు ఉపసంహరణ లేదా డిపాజిట్‌ను ఖచ్చితంగా పర్యవేక్షించాలి. సంబంధిత వివరాలను ఆదాయపు పన్ను శాఖ నోడల్ అధికారులకు అందజేయాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో ఈసీ పేర్కొంది.
Wedding invitation: పెళ్లి కార్డుపై మోడీ ఫోటో.. బీజేపీ కార్యకర్త వినూత్న ప్రచారం..!
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!