KFC Chiken: హైదరాబాద్ లో కుళ్ళిన ఆహార పదార్థాల అమ్మకం ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. అంగట్లో సరుకులు అమ్ముడు పోవడం.. సరా మామూలుగా ఉంటుంది. అయితే కేఎఫ్ సీ రెస్టారెంట్ పేరు చెబితే చాలు నోరు ఊరాల్సిందే. అలాంటి రెస్టారెంట్ లో ఒక్కసారైనా చికెన్ తానాల్సిందే. ఎందుకంటే ఆరెస్టారెంట్ లోని చికెన్ పీస్ లో వున్నరుచి అలాంటిది మరి. అంతేకాదు తినాలంటే.. మనం అక్కడకు వెళ్లి ఆర్డర్ పెట్టి గంటలు వేయిట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా స్విగ్గీ, జుమాటో, ఇలా రకరకాల అప్ లు మనకు అందుబాటులో వున్నాయి. దీంతో ఆ వ్యక్తి ఓ రెస్టారెంట్ ఇచ్చిన ఫుడ్ చూసి దింమ్మతిరిగేంత పని అయ్యింది. ఎందుకంటే అందులో ఆర్డర్ పెట్టిన ఫుడ్ కుళ్లిపోయాయి. షాక్ తిన్న వినియోగదారుడు.. ఫుడ్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు.
Read also: Rashmika Mandanna: డైలాగ్ బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు.. ఎలా నటించాలో నాకు తెలుసు: రష్మిక
సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరు వాసి శివ మేడ్చల్ పట్టణంలోనీ కే.ఎఫ్.సి లో చికెన్ లెగ్ పీసులు ఆర్డర్ చేశాడు. ఆర్డర్ ఒకే చేసిన సిబ్బంది కొన్ని నిమిషాలపాటు చూపించాడు. కేఎఫ్.సీ నుంచి ఆర్డర్ తీసుకుని డిలవరీ చేయాల్సిన ప్రదేశానికి బయలు దేరాడు. ఆర్డర్ చేసిన ప్లేస్ లో డివరీ చేసి అక్కడి నుంచి స్వీగ్గీ బాయ్ వెళ్లిపోయాడు. స్వీగ్గీ ఆర్డర్ తీసుకున్న వినియోగదారుడు శివ పార్సల్ ను ఓపెన్ చేసి చూశాడు. ఆ పార్సల్ లో నుంచి కుళ్లిపోయిన వాసన వచ్చింది. చికెన్ లెగ్ పీసులను పరిశీలించగా కుళ్లిపోయినట్లు గమనించాడు శివ. అంతే కుళ్లిపోయి చికెన్ లెగ్ పీస్‌ల పార్శల్ ను తీసుకుని మేడ్చల్ పట్టణంలో ఉన్న కెఎఫ్ సీ రెస్టారెంట్ కు బయలు దేరాడు.
Read also: UP Horror: అబార్షన్ మాత్రలకు నో చెప్పిందని, మహిళకి యాసిడ్ తాగించి హత్య..
అక్కడ వున్న కేఎఫ్ సీ సిబ్బందిని ప్రశ్నించాడు. అయితే కేఎఫ్ సీ సిబ్బంది పొంతలేని సమాధానం చెప్పడంతో శివ ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటలనే ఘటనాస్థలానికి చేరుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు కేఎఫ్ సీ లోని చికెన్ ను పరిశీలించారు. ఆహార భద్రత లేకుండా ఇలాంటి మాంసాన్ని విక్రయం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే కొందరు స్థానికులు కేఎఫ్ సీలోనే కాకుండా.. సదరు హోటల్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేప్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడేవారి రెస్టారెంట్ లను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
DK Shivakumar: కరువు సహాయ నిధుల జాప్యాన్ని అంగీకరించిన కేంద్ర మంత్రి.. నిర్మలకు డీకే ధన్యవాదాలు