Site icon NTV Telugu

Robberies: వరుస దొంగతనాలతో జనం టెన్షన్

వరుస దొంగతనాలు జనం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి తేడా లేదు…తాళం వేసి ఎటైనా బయటకు వెళ్లారా? అంతే సంగతులు. ఆ ఇంటికి కన్నం వేసేస్తున్నారు.వారం రోజుల్లో ఆరు చోట్ల వరుస దొంగతనాలు జరిగాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం… బొగ్గు గనులతో విరాజిల్లుతోంది. ఎక్కువగా సింగరేణి, జెన్కో కార్మికులే ఎక్కువ. వాణిజ్య,వ్యాపార పరంగానూ అభివృద్ది చెందుతోంది.జిల్లా కేంద్రంగా మారడంతో భూపాలపల్లిలో జిల్లా ఎస్పీ నుంచి అనేక మంది పోలీస్ అధికారుల పాలన జరుగుతోంది.

పటిష్టమైన బందోబస్తు .. కానీ దొంగ తనాలు మాత్రం ఆగడంలేదు. పగలు,రాత్రి తేడా లేకుండా దొంగలు రెచ్చిపోతున్నారు.వరుస దొంగతనాలు జనం ఆందోళనకు గురవుతున్నారు. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటికి తాళం వేసి ఎదైనా ఊరికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో వస్తువులు దోపిడీకి గురవుతున్నాయి. ఇలా వరుస దొంగతనాలతో జనం ఊరెళ్లాలన్నా భయపడిపోతున్నారు.

పట్టణంలో గత వారం రోజుల్లోనే ఆరు ఇళ్లల్లో దోపిడీ చేశారు.ఈనెల 3వ తేదీన ఒకే రోజు ఎల్బీ నగర్ లో శ్రీనివాస్,రమేష్ రెండు ఇళ్ళలో చోరీ చేశారు. 6తులాల బంగారం, 50వేల నగదు దోపిడీ చేశారు. అలాగే కృష్ణ కాలనీ,జవహర్ లాల్ కాలనీలో మూడు ఇళ్ళలో దొంగతనాలు జరగగా.. సుమారు 8తులాల బంగారం, వెండి, 2లక్షల రూపాయలు నగదు చోరీ అయ్యాయి.

వాయిస్ ఓవర్: ఇలా పలు ఇళ్ళలో చొరబడి అందిన కాడికి దోచుకెళ్లాతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని సరైన భద్రత కల్పించడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు,ఎమ్మెల్యేలు లాంటి వీవీఐపీల తప్ప సామాన్యులను పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుపై ఎల్ బి నగర్ కాలనీ వాసులు వినూత్న రీతిలో రోడ్డుపై నిరసన చేసిన తీరు ఇక్కడ తాజా పరిస్థితికి అద్దం పడుతోంది.

ఇప్పటికైనా పోలీసులు దోపిడీలకు అడ్డుకట్ట వేసే విధంగా దర్యాప్తు ముమ్మరం చేయాలని, దొంగలను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కాలనీల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు, పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ సార్లు కాలనీల్లో నిర్వహించాలని కోరుతున్నారు.

Bhupalpally: మా ఊళ్ళో అపార సంపద.. ఓపెన్ కాస్ట్ చేసెయ్యండి

Exit mobile version