వరుస దొంగతనాలు జనం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి తేడా లేదు…తాళం వేసి ఎటైనా బయటకు వెళ్లారా? అంతే సంగతులు. ఆ ఇంటికి కన్నం వేసేస్తున్నారు.వారం రోజుల్లో ఆరు చోట్ల వరుస దొంగతనాలు జరిగాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం… బొగ్గు గనులతో విరాజిల్లుతోంది. ఎక్కువగా సింగరేణి, జెన్కో కార్మికులే ఎక్కువ. వాణిజ్య,వ్యాపార పరంగానూ అభివృద్ది చెందుతోంది.జిల్లా కేంద్రంగా మారడంతో భూపాలపల్లిలో జిల్లా ఎస్పీ నుంచి అనేక…