Traffic Challan : బైక్ నడపడం అంటే సురక్షితంగా ఉండటం అత్యంత ముఖ్యం. కానీ, చాలా మంది బైక్ రైడర్లు.. స్లిపర్స్ వేసుకుని బైక్ నడిపితే ఏమైవుతుందిలే..? అని ఆలోచిస్తారు. కానీ.. 1988 (Motor Vehicles Act, 1988) కింద, వాహనాన్ని సురక్షితంగా నడపడం తప్పనిసరి. మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం.. వాహనం నడుపుతున్నప్పుడు పూర్తిగా నియంత్రించగల సామర్థ్యం ఉండాలి. స్లిపర్స్, వదులుగా ఉండే చెప్పులు వేసుకుని బైక్ నడపడం నేరుగా నిషేధం కాదు. కానీ, స్లిపర్స్, చెప్పుల కారణంగా పాదం స్లిప్ కావడం, బ్రేక్/క్లచ్ వేసే విధానంలో నియంత్రణ సమస్యలు రావడం వంటి పరిస్థితుల్లో, పోలీస్‌ల డిస్క్రేషన్ ప్రకారం అసురక్షిత డ్రైవింగ్ (unsafe driving) గా పరిగణించవచ్చు. ఇది ఓన్లీ బైక్‌కి మాత్రమే పరిమితం కాదు, కారు లేదా ఇతర వాహనాలకి కూడా వర్తిస్తుంది.
జరిమానా & చట్టం
సురక్షిత ప్రత్యామ్నాయం
స్లిపర్స్ వేసుకొని బైక్ నడపడం చట్టం ప్రకారం నేరుగా నిషేధం కాదు. కానీ, డ్రైవింగ్‌లో అసురక్షిత పరిస్థితులు కలిగితే జరిమానా తప్పనిసరి. ఎల్లప్పుడూ ఫిట్ షూస్ ధరించి రైడ్ చేయడం భద్రతపరంగా అత్యుత్తమం.