Site icon NTV Telugu

రాజీవ్‌గాంధీ భద్రతా సిబ్బందిని నిందించలేదు: రేవంత్‌రెడ్డి

పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగలు తాకాయి. రైతులు అడ్డుకోవడంతో ఆయన ఫిరోజ్ పూర్ జిల్లాలో ఓ ఫ్లైఓవర్ పై 20 నిమిషాల పాటు నిర్భంధంలో ఉండాల్సి వచ్చింది. ఇది భద్రతా వైఫల్యం అంటూ కేంద్రం పేర్కొంది. కాంగ్రెస్ పాలిత పంజాబ్ సర్కారే దీనికి బాధ్యత వహించాలని అంటోంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. హత్యకు గురికాకముందు గతంలో ఆయనపై రెండుసార్లు దాడి జరిగింది.

Read Also: ప్రేమ వివాహం చేసుకున్న జంటపై గొడ్డలితో దాడి

కానీ ఆయన ఎప్పుడూ భద్రతా సిబ్బందిని నిందించలేదు. కాంగ్రెస్ పార్టీకి దేశమే ప్రథమ ప్రాధాన్యత. కానీ ఇవాళ మన ప్రధాని మాత్రం భద్రతా వైఫల్యం అంటూ నిందిస్తున్నారు. అభద్రతా భావంతో ఉన్న ఆయన తనపై ఎలాంటి దాడి జరగకపోయినా ఆరోపణలు చేస్తున్నారు అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. ఈ మేరకు గతంలో రాజీవ్ పై దాడులకు సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.


Exit mobile version