ప్రేమ వివాహం చేసుకున్న జంటపై గొడ్డలితో దాడి

అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ళ కిందట వివాహాం చేసుకున్న ప్రేమ జంటపై అమ్మాయి మేనమామ జహాంగీర్‌ గొడ్డలితో దాడి చేయడం కలకలం రేపుతోంది. ఈ దాడిలో వివాహిత భర్త రాజు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లష్కర్‌గూడ, సుర్మయ్‌గూడకు చెందిన రాజు అదే గ్రామానికి చెందిన మైనార్టీ యువతిని ఆరేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Read Also:పంజాబ్‌ ఐకాన్‌గా ఉండను: సోనూసూద్‌

ఈ రోజు ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా తన మేన కోడలు ఆమె భర్తపై అబ్దుల్లాపూర్‌ మెట్‌ వద్ద జహంగీర్‌ గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత నాలుగు రోజుల కిందట ఎల్బీనగర్‌ గ్యాంగ్‌ వార్‌ ఘటన మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు.

Related Articles

Latest Articles