ఉద్యోగాలు ఇవ్వకపోగా అరెస్టులు చేసి జైల్లో పెడతారా..?: రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలపై దాడలు చేస్తారా అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలు ఇవ్వకపోగా అరెస్టులు చేసి జైల్లో పెడతారా..? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాగే నిర్భందం కొనసాగిస్తే ప్రతిఘటన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాయకులపై దాడులు, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడానికి వెళ్లిన యువజన కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం ఏంటని దుయ్యబట్టారు. ఏడేళ్లుగా తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయలేదన్నారు. 3,016 రూపాయల నిరుద్యోగ భృతి ఇంతవరకు ప్రకటించలేదని మండిపడ్డారు.
Read Also: చిన్న జీయర్ స్వామిని కలిసిన మొగులయ్య
Also Read
యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన యువజన కాంగ్రెస్ రంగా రెడ్డి జిల్లా అధ్యక్షుల రవి కాంత్ గౌడ్ పై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని ఇదే సంస్కృతి అని రేవంత్ రెడ్డి టీఆర్ఎస్పై ఫైర్ అయ్యారు. జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి లో బాగంగా జడ్చర్లలో పోలీసులు అత్యుత్సాహం వలన యువజన కాంగ్రెస్ కార్యకర్త శ్రీనివాస్ నాయక్ కాలు విరిగిందన్నారు. పోలీసులు శాంతి భద్రతలు కాపాడకుండా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా దాడులు అరెస్టులు చేస్తారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకోసమేనా యువకులు ఆత్మబలిదానాలు చేసి తెలంగాణ సంపాదించుకున్నది అని విమర్శించారు. తెలంగాణలో అరాచక నియంత పాలన కొనసాగుతుందన్నారు. వెంటనే ఖాళీ లు అన్ని భర్తీ చేసి, నిరుద్యోగ భృతిని ప్రకటించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్‌తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్‌కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్‌లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్‌తో అల్టిమేట్ యాక్షన్ ?
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!