Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Revanth Sarkar Conferences Across The State From March 1 To 7

CM Revanth Reddy: రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్‌ సర్కార్‌ సదస్సులు.. మార్చి 1వ తేదీ నుంచి 7 వరకు..?

Published Date :February 27, 2024 , 9:08 am
By Bhanu
CM Revanth Reddy: రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్‌ సర్కార్‌ సదస్సులు.. మార్చి 1వ తేదీ నుంచి 7 వరకు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలతో తన బ్రాండ్ పాలనను కొనసాగిస్తున్నారు. ఒకవైపు తనదైన శైలిలో పాలన కొనసాగిస్తూనే మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని తొలగించేందుకు అన్ని రకాల కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించిన ప్రతిదానిపైనా దృష్టి సారిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల కరెంటు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేశారు. కాగా, తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసిన ధరణి పోర్టల్ పై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు.

Read also: TSPSC Group 1: తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..?

Also Read

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
  • RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
  • Bank Fraud: SBI బ్యాంక్‌లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్‌తో పాటు..
  • Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?

ఈ క్రమంలో ధరణిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి మార్చిలో రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పుడు ధరణి పోర్టల్‌ను క్లీన్ చేసే దిశగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇతర వ్యక్తుల పేర్లతో నమోదైన ప్రభుత్వ భూముల వివరాలతో శ్వేతపత్రం ఉంటుందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.

Read also: Rajya Sabha Elections: నేడే రాజ్యసభ ఎన్నికల పోలింగ్.. ఏకగ్రీవమైన సభ్యులు వీరే..!

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో భూకబ్జాలకు పాల్పడి ఆరోపణలు ఎదుర్కొన్న గులాబీ నేతలే ఈ శ్వేతపత్రం టార్గెట్‌ కానుందని తెలుస్తోంది. ఈ క్రమంలో.. ధరణి పోర్టల్ పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సమీక్షలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ధరణిపై ఏర్పాటైన కమిటీ చేసిన సూచనలకు అనుగుణంగా విధివిధానాలు రూపొందించి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు.

Read also: BJP High Command: రాష్ట్రానికి మోడీ, అమిత్‌ షా, నడ్డా.. ఈనెల 29న తొలి జాబితా?

ఈ క్రమంలోనే.. ధరణి సమస్యల పరిష్కారానికి మార్చిలో రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అయితే బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రారంభమైన ధరణి పోర్టల్‌ సమస్యలకు నిలయంగా మారిందని, ఈ పోర్టల్‌ను గులాబీ నేతలు అడ్డం పెట్టుకుని కొనసాగిస్తున్నారని రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ నేతలంతా తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. భూకబ్జాలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పోర్టల్ వల్ల రైతుల భూములన్నీ వివాదాల్లో చిక్కుకున్నాయని.. చాలా చోట్ల అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ పోర్టల్‌ను ఎత్తివేస్తామని ప్రకటించారు.
Astrology: ఫిబ్రవరి 27, మంగళవారం దినఫలాలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dharani Portal
  • revanth reddy
  • Revanth Sarkar conferences across the state from March 1 to 7.
  • telangana dharani portal
  • white paper on dharani

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions