కేసీఆర్.. కరోన కంటే డేంజర్ వైరస్ అని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సచ్చిపోయిన కరోనా పేషేంట్ టైప్ అని ఆయన వ్యాఖ్యానించారు. భూములు అమ్మి… డబ్బు దోచుకుంటున్నారని, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాస్తానని, కేసీఆర్ అవినీతి వివరిస్తానన్నారు. పార్థసారధి మీద ఇన్ని ఆరోపణలు ఉన్నా.. కేసీఆర్ రాజ్యసభ ఇచ్చారు. ఆర్థిక నేరగాడు పార్థసారధి. కేసీఆర్ జాగీరా…భూములు ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి. రాజకీయాల్లో నేరగాళ్లు ఉండొద్దు. ఆర్థిక నేరగాళ్లు అసలే ఉండొద్దు. కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎన్ని. ఎన్నికలకు ముందు..తరువాత ఎంత..?ఔటర్ రింగ్ రోడ్స్ పక్కన పార్థసారధి ఆసుపత్రి కడితే ప్రజలకు మేలు.. హైటెక్ సిటీ లో ఏం లాభం.. విలువైన భూమి.. పార్థసారధికి ఎందుకు ఇచ్చారు.
Also Read : Vizag Steel Plant: హీట్ పెంచుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్.. టార్గెట్ కేసీఆర్..!
సీబీఐకి లేఖ రాస్తా.. భూముల కేటాయింపు పౌ విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తా.. ఆరు నెలల్లో అధికారం కాంగ్రెస్ దే. అన్నిటి మీద విచారణ జరిపించి బొక్కలో వేస్తా. సోమేశ్.. అర్వింద్.. రంగారెడ్డి.. మేడ్చల్.. హైద్రాబాడ్ కలెక్టర్ లు జైల్లోకి పంపుతా.. కేసీఆర్ ఆదాయ వనరు.. సోమేశ్. పార్థసారధి పెద్డ మనిషా.. పెద్దల సభకు పంపడానికి.. 41 సర్వే నెంబర్ లో 60 ఎకరాలు కేసీఆర్ కొల్లగొట్టారు. రేపు యశోద ఆసుపత్రుల భూముల వివరాలు బయట పెడతా.. కేసీఆర్ తో కుడేది లేదని అధిష్టానం చెప్పింది. ఆ ఇంటి మీద కాకి..మా ఇంటి మీద వాలదు. వాలితే సచ్చిందే.. బీఆర్‌ఎస్ కోట బీటలు పారింది. జూపల్లి.. పొంగులేటి నాకు మిత్రుడు.. కేసీఆర్ చేతిలో మోసపోయిన వారికి నా సానుభూతి ఉంది. పొంగులేటి.. జూపల్లి ఎటు వెళ్తారో చూద్దాం..
నేను వాళ్ళ ఇంటికి వెళ్లాలా.. వాళ్లే మా పార్టీ ఆఫీస్ కి వస్తారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Google Pay: మీకు జీపే ఉందా..? రూ.81 వేల క్యాష్ బ్యాక్..? చెక్ చేసుకొండి..!
