NTV Telugu Site icon

Revanth Reddy: గవర్నర్, సీఎంల మధ్య విభేదాలు ఉంటే వేరే వేదిక చూసుకోవాలి.. ఇది సరైన పద్దతి కాదు..

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy sensational comments on CM KCR behavior: గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్ హాజరయ్యారు. అనంతరం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్.. సీఎం మధ్య విభేదాలు ఉంటే వేరే వేదిక మీద చూసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. గణతంత్ర దినోత్సవం విషయంలో గొడవ సరికాదని.. ప్రభుత్వం వెంటనే గవర్నర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రిపబ్లిక్ డే ని నిర్వహించాలని కోర్టు అదేశించే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ఈ జాతి గొప్పదనం స్మరించుకోవాల్సిన సమయం ఇది అన్నారు రేవంత్‌ రెడ్డి.

Read also: Republic Day 2023: దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు

అబద్ధపు పునాదుల మీద బీజేపీ అధికారంలోకి వచ్చిందని, వాళ్ళ విధానాలు చూస్తుంటే.. రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగుతుందా అనే అనుమానం కలుగుతోందన్నారు రేవంత్‌ రెడ్డి. కాంగ్రెస్ పబ్లిక్ సెక్టార్ ని పెంచింది.. బీజేపీ ప్రయివేట్ చేస్తున్నారని ఆరోపించారు. పబ్లిక్ సెక్టార్ లను అమ్మడానికి ఓ మంత్రినే పెట్టారు మోడీ అన్నారు. పబ్లిక్ సెక్టార్ సంస్థలు అమ్మడంతో రిజర్వేషన్లు పోతున్నాయని తెలిపారు. దళిత.. గిరిజనులు ఆలోచన చేయాలని అన్నారు. జర్వేషన్ స్ఫూర్తి దెబ్బ తీసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూల్చి రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడ్డారు.. కేసీఆర్… కూడా అంతే అన్నారు. ఓ పార్టీలో గెలిచి.. మరో పార్టీలోకి పోతే అత్యాచారం.. హత్య కేసులో వేసినట్టు ఉరిశిక్ష వేయాలని రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Bandi Sanjay: గణతంత్ర వేడుకలు నిర్వహించాలంటే.. కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి

పార్టీ మారిన సభ్యుడి సభ్యత్వం రద్దు చేసే చట్టాలు తేవాలన్నారు. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారితే.. అత్యాచారం కేసులో ఎలాంటి శిక్షలు వేస్తారో అలాంటి శిక్షలు వేయాలన్నారు. పార్టీ ఫిరాయింపులు దేశానికి ప్రమాదంగా మారిందని మండిపడ్డారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేసి.. చర్యలు తీసుకోవాలని అన్నారు రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులు చేసే వారికి ఉరి శిక్ష వేసేలా రాజ్యాంగ సవరణ తేవాలని డిమాండ్‌ చేశారు. ఫిబ్రవరి 6 నుండి ప్రతీ గడప వెళతామన్నారు. ఫిబ్రవరి 6 నుండి ప్రతీ గడప వెళతామన్నారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ స్ఫూర్తి తో హాత్ సే హాత్ జొడో యాత్ర ప్రారంభం కానుందని..నిరంతరం పాదయాత్ర లో పాల్గొంటామన్నారు. పార్టీ ఆదేశించినట్టు పాదయాత్ర కొనసాగుతుందని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Read also: Raghunandan Rao: ఖమ్మంలో బహిరంగ సభ పెడితే.. కరోనా పాండమిక్ ఉండదా?

కేసీఆర్ చేస్తున్న రాజకీయ విషప్రచారంలో ఈటెల కూడా పాత్ర ధారి అన్నారు. ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టె సంస్కృతి ఈటెలకు ఇష్టం లేదన్నారు. హుజురాబాద్ లో వందల కోట్లు ఈటెల ఖర్చు పెట్టారని, మునుగోడులో ఈటెల చేతుల మీద నుండే ఖర్చు పెట్టించారన్నారు. కేసీఆర్ ని దారిలోకి తెస్తా అన్న ఈటెల.. కేసీఆర్ దారిలోనే వెళ్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో డబ్బుల ఖర్చుకి ఈటెల వ్యతిరేకి అని రేవంత్ వ్యాఖ్యానించారు.

Read also: Gutha Sukender Reddy: బాధ్యతల్లో ఉన్నవాళ్లే.. తెలంగాణ అభివృద్దిని గుర్తించకపోవడం బాధకరం

పద్మ అవార్డుల గ్రహీతలకు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో వివిధ రంగాలలో విశేష సేవలు చేసిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పద్మ భూషణ్, పద్మ విభూషన్, పద్మ శ్రీ అవార్డులు పొందిన ప్రముఖులకు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రం ప్రకటించిన మొత్తం 106 పద్మ అవార్డులలో తెలుగు వారికి 12 పద్మ అవార్డులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పద్మ అవార్డులు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Gutha Sukender Reddy: బాధ్యతల్లో ఉన్నవాళ్లే.. తెలంగాణ అభివృద్దిని గుర్తించకపోవడం బాధకరం