NTV Telugu Site icon

Revanth Reddy: బండి సంజయ్‌, కేఏ పాల్ మాటలకి పెద్ద తేడా ఉండదు.. రేవంత్ సెటైర్లు

Revanth On Bandi Sanjay

Revanth On Bandi Sanjay

Revanth Reddy Satires On Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు, కేఏ పాల్ మాటలకు పెద్ద తేడా ఉండదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ నిరాశలో ఉన్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోజులో తమ దగ్గరున్న వాళ్లను బండి సంజయ్ ఎత్తుకుపోయాడని, ఇప్పుడు ఏమైందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా.. కాంగ్రెస్‌ని గెలిపించమని బండి సంజయ్ అన్నారని గుర్తు చేశారు. బండి సంజయ్ మాటలను సీరియస్‌గా కాకుండా, సానుభూతితో చూడాలని సూచించారు. బండి సంజయ్ పట్ల సానుభూతి తప్ప.. వేరే విషయం ఉండదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని.. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్టేనని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు గాను.. రేవంత్ రెడ్డి ఈ విధంగా కౌంటర్లు ఇచ్చారు.

Mahi V Raghav: డిస్నీ+ హాట్‌స్టార్ పరువు తీశారంటే.. ‘పంది’తో గొడవ పడలేనంటున్న డైరెక్టర్!

ఇదే సమయంలో.. తెలంగాణ ప్రభుత్వంపై కూడా రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో భూముల ధరలు పెరగడానికి ప్రభుత్వమే కారణమైతే.. రైతుల భూములకు ఎందుకంత ధర చెల్లించడం లేదని ప్రశ్నించారు. రేపు తానే తెలంగాణను అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్తే.. కేసీఆర్ దాన్ని కూడా ఆమోదిస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కి ఏది నచ్చితే అది అన్వయించుకోవడం.. రాజకీయ వ్యభిచార లక్షణమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరవీరుల స్థూపం నిర్మాణంలో చాలా అవినీతి జరిగిందని ఆరోపించారు. అమరవీరుల పేర్లు లేకుండా అమరస్థూపం ఏంటని ప్రశ్నించారు. పవిత్రమైన అమరుల స్మారకాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి అపవిత్రం చేశారని వ్యాఖ్యానించారు. ఏడాదిలోనే ప్రగతి భవన్ కట్టగలిగినప్పుడు.. అమరవీరుల స్థూపం కట్టేందుకు 9 సంవత్సరాలు ఎందుకు పట్టిందని నిలదీశారు. సచివాలయ నిర్మాణంలోనూ అవినీతి జరిగిందన్న ఆయన.. వీటిపై విజిలెన్స్ విచారణ జరిపి, అందరినీ జైలుకు పంపుతామన్నారు.

Bihar: పట్టపగలే బీహార్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం