CM Revanth Reddy: రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫైలు సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరినట్లు తెలుస్తోంది. ఆమోదం పొందిన తర్వాత మార్గదర్శకాలు విడుదల చేసి 15 రోజుల్లో బదిలీలు పూర్తి చేయాలన్నారు. కనీసం రెండేళ్లు ఒకేచోట పనిచేసిన వారికి అవకాశం కల్పించాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. గరిష్ఠంగా నాలుగేళ్లపాటు ఒకేచోట పనిచేసిన వారిని బదిలీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ బదిలీలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖలో ప్రక్షాళన జరగనుందని అంటున్నారు. ఆ శాఖల్లో కొందరు అధికారులు ఏళ్ల తరబడి పాతుకుపోయారు.
Read also: Bomb Threat: చెన్నై-ముంబై ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ప్రయాణికులు సురక్షితం
ఇక మరోవైపు జూన్ మొదటి వారం వరకు ఎన్నికల కోడ్ ఉండడంతో పాటు జూన్ 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉద్యోగుల పిల్లల చదువులకు ఆటంకం పేరుతో ఈ ఏడాది కూడా సాధారణ బదిలీలు జరగకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఎన్నికల సంఘం అనుమతితో ఈ నెలలోనే సాధారణ బదిలీలు నిర్వహించి, జూన్ మొదటి వారంలో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే బదిలీ ఉత్తర్వులు జారీ చేసి, ఉద్యోగులను విడుదల చేస్తే.. ఎన్నికల నిర్వహణకు, పిల్లల చదువులకు ఆటంకం కలుగదు అన్నారు. అంతేకాదు ఉద్యోగుల చిరకాల కోరిక నేరంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలను సక్రమంగా నిర్వహించాలి. ఈ బదిలీలకు వారం లేదా పది రోజులు సరిపోతుంది. అడ్మినిస్ట్రేషన్ యొక్క ఇబ్బంది లేకుండా సాంకేతికతను ఉపయోగించి ఆన్‌లైన్‌లో వేగంగా పూర్తి చేయవచ్చు.
Team India: హైదరాబాద్ ఆటగాళ్లకు జాక్‌పాట్.. టీమిండియాలో చోటు!