తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టారు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. హాత్ సే హాత్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పీసీసీ చీఫ్ ముందుకు సాగుతున్నారు. రేవంత్ చేపట్టిన యాత్ర నేటితో 29వ రోజుకు చేరింది. యాత్రలో భాగంగా ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర సాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో మూడవరోజు రేవంత్ రెడ్డి పాదయాత్రఈరోజు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు కొత్త కలెక్టరేట్ సమీపంలో గిరిరాజ్ కాలనీ రోడ్డులోని రాజీవ్ స్వగృహ భవనాలను రేవంత్ సందర్శిస్తారు. నిజామాబాద్ దుబ్బ చౌరస్తా నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది. అమల్ వాడి, సతీష్ పవార్ చౌరస్తా, శివాజీ చౌక్, భగత్ సింగ్ చౌరస్తా, గోల్ హనుమన్ చౌరస్తా, పెద్ద బజార్ చౌరస్తా, అజ్ హమ్ రోడ్ మీదుగా నెహ్రూ పార్కు వరకు యాత్ర చేరుకోనుంది. రాత్రి 7 గంటలకు నిజామాబాద్ నెహ్రూ పార్కు వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఏర్పాటుచేశారు.
Also Read: BRS: మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగసభ.. కేసీఆర్ టార్గెట్ అదే
కాగా, పాదయాత్రలో భాగంగా బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు చూడొద్దని, కాంగ్రెస్ కు అధికారం ఇవ్వాలని ప్రజలను కోరుతుున్నారు. ప్రజలను మంచి చేసుకునేందుకు ఈసారి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ధరణితో సమస్యలు ఎదుర్కుంటున్న రైతులకు అండగా నిలస్తామని రేవంత్ హామీలు ఇస్తున్నారు.