Revanth Reddy: లిస్ట్ ప్రకారమే ఓటింగ్ జరిగింది.. నేను ఇన్వాల్వ్ కాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy On AICC Elections: ఏఐసీసీ ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్య బద్ధంగానే జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఓటరు లిస్ట్‌కి, పీసీసీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏఐసీసీ ఎన్నికల డేలిగేట్స్ అంతా పైనుండే వస్తుందని.. వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారమే ఓటింగ్ జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోలేదని, తాను కేవలం ఓటరు మాత్రమేనని, తాను తన ఓటు వేసుకున్నానని తెలిపారు. మిగతాదంతా పీఆర్వో వాళ్లే చూసుకున్నారన్నారు. అర్హత లేని వారికి ఇచ్చారని భావించినా, ఎవరికైనా ఏమైనా అపోహలు ఉన్నా.. ఏఐసీసీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పారు. ఇక ఉప ఎన్నికల్లో ఫ్రీ సింబల్స్ ఇవ్వొద్దనే అధికారం ఎవ్వరికీ లేదని, కారు గుర్తు కూడా ఒకప్పుడు ఫ్రీ సింబలేనని అన్నారు.
మరోవైపు.. ఏఐసీసీ ఎన్నికలపై రిటర్నింగ్ అధికారి రాజమోహన్ ఉన్నితన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 238 పీసీసీ డెలిగేట్స్ ఉన్నారన్నారు. ముగ్గురు ఏఐసీసీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఎన్నికలు సజావుగా సాగాయని వెల్లడించారు. రేపు ఎన్నికల సంఘానికి తాము బ్యాలెట్ బాక్స్ అందజేస్తామని, 19వ తేదీన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వస్తాయని చెప్పారు. కాగా.. ఉత్కంఠ రేపిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు సోమవారం సాయంత్రం 4 గంటలకు ముగిశాయి. దేశవ్యాప్తంగా సగటున 96 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో, ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో పోలింగ్ జరిగింది. ఎవరికైతే 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు పొందుతారో.. వారినే విజేతగా ప్రకటిస్తారు. సీనియర్ల మద్దతు ఎక్కువగా ఉన్న మల్లికార్జున ఖర్గే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్‌తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్‌ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్‌ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!