NTV Telugu Site icon

Revanth Reddy: పసుపు బోర్డు తెస్తానని పత్తా లేకుండా పోయారు

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: పసుపు బోర్డు తెస్తానని చెప్పి బాండు పేపర్ రాసి ఇచ్చి పత్తా లేకుండా పోయారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి హత్ సే హత్ జోడో యాత్ర నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లికి చేరుకుంది. ఉదయం బెంగాల్ లింబాద్రి నర్సింహస్వామిని దర్శించుకున్న అనంతరం కమ్మర్ పల్లిలో రైతులతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంత రైతులను అదుకోలేదన్నారు. బోర్డు తెస్తానని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. పసుపు, ఎర్రజొన్న, చెరుకు పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. తెలంగాణలో కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చారు కానీ యువతకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదని తెలిపారు.

Read also: Top Headlines @1PM: టాప్ న్యూస్

కల్వకుంట్ల కుటుంబానికి వేలకోట్ల ఆస్తుల వచ్చాయి, ఫామ్ హౌస్ భూములు వచ్చాయని ఆరోపించారు. ఆదాని, అంబానీ లకు దేశ సొత్తును మోడీ దోచి పెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా, పంజాబ్ రైతుల స్పూర్తి నిజామాబాద్ రైతులకు పోరాటం చేసె సత్తా ఉందని అన్నారు. పసుపు బోర్డు తెస్తానని చెప్పి బాండు పేపర్ రాసి ఇచ్చి పత్తా లేకుండా పోయిండని అన్నారు. 100 రోజుల్లో చెరుకు పరిశ్రమ తెరుస్తానని చెప్పి మాట తప్పారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత రైతులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎందుకు ఆదుకోవడం లేదు? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు అండగా నిలవాలన్నారు. 60 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చూసి పార్టీ నష్టపోయిన తెలంగాణ ను కాంగ్రెస్ ఇచ్చిందని రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు.

Read also: KTR Counter: పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి చూద్దాం? కిషన్​రెడ్డికి కేటీఆర్‌ కౌంటర్‌..

ఇవాళ పాదయాత్రకు బ్రేక్‌ ఇచ్చిన రేవంత్‌ కమ్మర్ పల్లిలో రైతులతో సమావేశమయ్యారు. నిజామాబాద్‌ నియోజకవర్గంలోనే 13 నుంచి 17 వరకు పాదయాత్ర కొనసాగనుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. కాగా.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నేటి స్ట్రాంగ్ క్యాడర్ ఉండటంతో..తిరిగి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చే విధంగా రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేలా తన యాత్ర షేడ్యూల్ ను రూపొందించారు. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
AP Politics: పవన్ భావజాలంలోనే ‘బీసీ’లు లేరు.. మంత్రి జోగి రమేష్ ఛాలెంజ్

Show comments