Praja Palana: తెలంగాణలో ప్రజాపరిపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ప్రజాపాలనకు ప్రభుత్వం రెండు రోజులు విరామం ఇచ్చింది. నేడు, రేపు (డిసెంబర్ 31 ఆదివారం సెలవు.. సోమవారం జనవరి 1) నూతన సంవత్సరం కావడంతో… ప్రభుత్వం అధికారికంగా రెండు రోజులు సెలవు ప్రకటించింది. దీంతో ఈ రెండు రోజుల పాటు ప్రభుత్వ పరిపాలన కౌంటర్లలో ఎలాంటి దరఖాస్తులు తీసుకోరు. మళ్లీ.. 2వ తేదీ నుంచి యదావిధిగా కొనసాగుతాయని.. 6వ తేదీ వరకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దరఖాస్తుల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన సూచించారు. పనులు మానుకుని దరఖాస్తుల కోసం వచ్చి సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు.
Read also: America : అమెరికాలో న్యూ ఇయర్ కొత్త నిర్ణయం.. బహిరంగ ప్రదేశాల్లో ఆయుధాలు నిషేధం
తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీల అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన పేరుతో గ్రామ, వార్డు సమావేశాలు నిర్వహించి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియను జనవరి 6 వరకు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.అయితే ఇందులో ప్రభుత్వం రెండు సెలవులు ప్రకటించింది. దీంతో దరఖాస్తులు తీసుకునేందుకు 8 రోజుల గడువు మాత్రమే ఇచ్చారు. ఇప్పటికే.. గ్రామ, వార్డు సభలకు జనం పెద్ద ఎత్తున తరలిరాగా.. భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. అయితే పలు ప్రాంతాల్లో దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. మరికొద్ది రోజులే సమయం ఉండడంతో.. ఈ దరఖాస్తులపై పలువురికి అనుమానాలు, గందరగోళం తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజాపాలన గడువును మరికొద్ది రోజులు పొడిగించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా, ఈ దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పదిరోజులు మాత్రమే ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంటుందని.. తర్వాత తీసుకోబోమని భయపడాల్సిన అవసరం లేదని.. దరఖాస్తులన్నీ తర్వాత తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని రేవంత్ రెడ్డి తెలిపారు.
SSMB 29: వంద కోట్లది ఏముందిలే… ఈ ఇద్దరూ కలిస్తే లెక్క రెండు వేల కోట్ల నుంచి మొదలవుతుంది